పెళ్లికి ముందే ఈ విషయాల్లో క్లారిటీ ఉండాలి!

పెళ్లి అనగానే ఎక్కడలేని భయాలు, ఫ్యూచర్ గురించిన ఆలోచనలు వెంటాడడం సహజం. అందుకే చాలామంది వాటి గురించి ఆలోచించకుండానే ‘నో’ చెప్పేస్తున్నారు. అయితే మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా సాగిపోవాలంటే పెళ్లికి ముందే మీ భయాలను నివృత్తి చేసుకోవాలి.

Advertisement
Update: 2024-04-29 14:30 GMT

పెళ్లికి ‘నో’ చెప్తున్నవాళ్ల సంఖ్య ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు బాగా పెరిగింది. పెళ్లి తర్వాత రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతోనే చాలామంది పెళ్లికి నిరాకరిస్తున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే పెళ్లికి ముందే కొన్ని విషయాల్లో క్లారిటీ తెచ్చుకుంటే అటువంటి భయాలకు తావు ఉండదని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. అవేంటంటే..

పెళ్లి అనగానే ఎక్కడలేని భయాలు, ఫ్యూచర్ గురించిన ఆలోచనలు వెంటాడడం సహజం. అందుకే చాలామంది వాటి గురించి ఆలోచించకుండానే ‘నో’ చెప్పేస్తున్నారు. అయితే మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా సాగిపోవాలంటే పెళ్లికి ముందే మీ భయాలను నివృత్తి చేసుకోవాలి. కాబోయే పార్ట్‌నర్‌‌తో కొన్ని విషయాల్లో స్పష్టత తెచ్చుకుంటే ఫ్యూచర్‌‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మ్యారిటల్ లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది.

సంపాదన గురించి

పెళ్లికి భయపడేవాళ్లలో చాలామందికి కెరీర్, సంపాదన గురించే ఎక్కువ బెంగ ఉంటుందని స్టడీల్లో తేలింది. కాబట్టి ఇలాంటి భయాలు ఉన్నవాళ్లు పెళ్లికి ముందే ఆర్థిక విషయాల గురించి పార్ట్‌నర్‌‌తో చర్చించాలి. మీ ఉద్యోగం, ఫ్యూచర్‌‌లో ఆ ఉద్యోగానికి ఉండే స్కోప్, మీ ఫైనాన్షియల్ గోల్స్ గురించి చర్చించుకోవాలి. ఆదాయాన్ని బట్టి కోరికలు, ఖర్చులు, పొదుపు విషయాల్లో ఇద్దరికీ ఒక అవగాహన ఉంటే ఫ్యూచర్‌‌లో ఇబ్బందులుండవు. కాబట్టి ఆర్థిక పరమైన విషయాల్లో పార్ట్‌నర్స్ ఇద్దరూ స్పష్టంగా చర్చించుకున్నాకే బంధంలోకి అడుగు పెడితే మంచిది.

గతం గురించి కూడా..

ప్రస్తుతం రిలేషన్‌షిప్స్‌లో ట్రస్ట్ ఇష్యూస్ ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటివి రాకుండా ఉండాలంటే పార్ట్‌నర్స్.. తమ గతానికి సంబంధించిన విషయాలను దాచకుండా స్పష్టంగా వివరించాలి. చాలామందికి జీవితంలో రకరకాల చేదు అనుభవాలు ఉండి ఉండొచ్చు అలాగే ఇంకేవైనా అనుకోని సంఘటనలు జరిగి ఉండి ఉండొచ్చు. అలాంటి విషయాలు దాచి ఉంచడం ద్వారా ఫ్యూచర్‌‌లో ఇబ్బందులు రావొచ్చు. కాబట్టి ఇలాంటి విషయాలు కూడా పెళ్లికి ముందే స్పష్టంగా చర్చించుకోవాలి.

పర్సనల్ గోల్స్..

ఈ రోజుల్లో అమ్మాయైనా, అబ్బాయైనా.. ప్రతిఒక్కరికీ ఒక పర్సనల్ గోల్ ఉండడం కామన్. అయితే కొన్ని సందర్భాల్లో పెద్దవాళ్లు వాటిని పట్టించుకోకుండా పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుంటారు. దీంతో కొంతమంది తమ గోల్స్‌ను విడిచిపెట్టలేక పెళ్లినే త్యాగం చేస్తుంటారు. ఇలాంటి సమస్య ఉన్నవాళ్లు పార్ట్‌నర్‌‌తో ముందే మీ గోల్ గురించి చర్చించి వారి వైపు నుంచి సపోర్ట్ ఉంటుందేమో మాట్లాడి చూడాలి. మీ లక్ష్యానికి ఎలాంటి అడ్డూ ఉండదని భావిస్తే భయపడకుండా పెళ్లి జీవితంలోకి అడుగుపెట్టొచ్చు.

ఇక వీటితోపాటు పార్ట్‌నర్ ఫ్యామిలీ పరిస్థితుల గురించి, వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, లైఫ్‌స్టైల్ గురించి కూడా తెలుసుకుంటే మంచిది. అలాగే పిల్లల విషయంలో కూడా ముందే ఒక అభిప్రాయానికి రావడం ఈ రోజుల్లో చాలా అవసరం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News