చిక్కుల్లో సీఎం రేవంత్.. ఢిల్లీ పోలీసుల నోటీసులు

వీడియో తెలంగాణలో తయారు చేసినట్లు గుర్తించిన ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్ రెడ్డి, టీ-కాంగ్రెస్‌ సోషల్‌మీడియా ఇన్‌ఛార్జి మన్నె సతీష్‌తో పాటు పలువురికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement
Update: 2024-04-29 10:26 GMT

సార్వత్రిక ఎన్నికల ముందు చిక్కుల్లో పడ్డారు తెలంగాణ సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు సంబంధించిన ఓ డీప్ ఫేక్‌ వీడియో కేసులో సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. మే 1న విచారణకు హాజరుకావాలని సీఎం రేవంత్‌ రెడ్డిని ఢిల్లీ పోలీసులు కోరినట్లు సమాచారం.

రిజర్వేషన్ల రద్దు అంశంపై అమిత్ షా మాట్లాడినట్లు ఎడిట్ చేసిన ఓ ఫేక్ వీడియోను సోషల్‌మీడియాలో గుర్తించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. ఆ వీడియో ఎవరు తయారు చేశారన్న దానిపై విచారణ చేపట్టాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. మతాల మధ్య చిచ్చుపెట్టేలా వీడియోను ఎడిట్ చేశారని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఈ వీడియో తెలంగాణలో తయారు చేసినట్లు గుర్తించిన ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్ రెడ్డి, టీ-కాంగ్రెస్‌ సోషల్‌మీడియా ఇన్‌ఛార్జి మన్నె సతీష్‌తో పాటు పలువురికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఇంతకీ వివాదం ఏంటి.!

ఓ బహిరంగ సభలో మాట్లాడిన అమిత్ షా.. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. వాటిని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఐతే అమిత్ షా ప్రసంగాన్ని వక్రీకరించి.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పినట్లుగా ఎడిట్ చేసి ఆ వీడియోను సోషల్‌మీడియాలో వైరల్ చేశారు.

Tags:    
Advertisement

Similar News