సెప్టెంబర్ లో రికార్డు స్థాయి వర్షపాతం..

ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో రికార్డు స్థాయి వర్షపాతం కురిసిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 1993 తర్వాత సెప్టెంబర్ నెలలో రెండో అత్యథిక వర్షపాతం 2021లోనే నమోదైందని అధికారులు చెప్పారు. 2019లో సెప్టెంబర్ లో అత్యథికంగా 250 మిల్లీమీటర్ల వర్షం కురవగా, ఈ ఏడాది 223 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రుతుపవనాల ప్రభావం ఈనెల 6వ తేదీ వరకు ఉండే అవకాశం ఉంది. రుతుపవనాల ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా 99శాతం వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ […]

Advertisement
Update: 2021-10-01 10:09 GMT

ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో రికార్డు స్థాయి వర్షపాతం కురిసిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 1993 తర్వాత సెప్టెంబర్ నెలలో రెండో అత్యథిక వర్షపాతం 2021లోనే నమోదైందని అధికారులు చెప్పారు. 2019లో సెప్టెంబర్ లో అత్యథికంగా 250 మిల్లీమీటర్ల వర్షం కురవగా, ఈ ఏడాది 223 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రుతుపవనాల ప్రభావం ఈనెల 6వ తేదీ వరకు ఉండే అవకాశం ఉంది. రుతుపవనాల ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా 99శాతం వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.

రుతుపవనాలు ఉండే నాలుగు నెలల్లో ఈ ఏడాది సాధారణంకంటే ఎక్కువ వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ ముందే అంచనా వేసి చెప్పింది. ఆగస్ట్ లో కాస్త తక్కువ వర్షపాతం నమోదైనా.. సెప్టెంబర్ లో 110 శాతం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైంది. దీంతో వాతావరణ శాఖ అంచనాలు నిజమయ్యాయి. పసిఫిక్ మహా సముద్రంపై ఉన్న ఎల్ నినో ప్రభావం నిదానంగా తగ్గుతుండటంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయని, అందువల్లే వర్షపాతం ఆశించిన స్థాయిలో ఉందని తెలిపింది.

రుతుపవనాలకు గులాబ్ తుపాను ప్రభావం కూడా తోడవడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో అత్యథిక వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లాయి, ప్రాజెక్ట్ లు నిండు కుండల్లా మారాయి. భూగర్భ జలాలు కూడా పెరిగాయి. ఈ వర్షాల ప్రభావం అక్టోబర్ 6 తర్వాత క్రమంగా తగ్గుతుందని వాతావరణ శాఖ వివరించింది.

Tags:    
Advertisement

Similar News