ఏడేళ్ల మౌనం దేనికి సంకేతం? కేసీఆర్ పై రేవంత్ మాటల తూటాలు..

ఏపీ, తెలంగాణ మధ్య లేని వివాదాన్ని కేసీఆర్ సృష్టిస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. జల వివాదంతో కేసీఆర్, రాజకీయ, ఆర్థిక లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఓ జాదూ అని, నీళ్ల నుంచి ఓట్లు రాబట్టగలరని ఎద్దేవా చేశారు. ఏపీ, తెలంగాణ ప్రజలు ఒకరి కుత్తుకలు ఒకరు తెంచుకునేలా విద్వేషాలు రెచ్చగొట్టగల నేర్పరని చెప్పారు. కేసీఆర్ అనుమతి తీసుకున్న తర్వాతే ఏపీ సీఎం జగన్.. రాయలసీమ ప్రాజెక్టు ప్రారంభించారని చెప్పారు. […]

Advertisement
Update: 2021-07-04 11:41 GMT

ఏపీ, తెలంగాణ మధ్య లేని వివాదాన్ని కేసీఆర్ సృష్టిస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. జల వివాదంతో కేసీఆర్, రాజకీయ, ఆర్థిక లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఓ జాదూ అని, నీళ్ల నుంచి ఓట్లు రాబట్టగలరని ఎద్దేవా చేశారు. ఏపీ, తెలంగాణ ప్రజలు ఒకరి కుత్తుకలు ఒకరు తెంచుకునేలా విద్వేషాలు రెచ్చగొట్టగల నేర్పరని చెప్పారు.

కేసీఆర్ అనుమతి తీసుకున్న తర్వాతే ఏపీ సీఎం జగన్.. రాయలసీమ ప్రాజెక్టు ప్రారంభించారని చెప్పారు. అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లి బేసిన్ లు లేవు, భేషజాలు లేవని ప్రకటించారని గుర్తు చేశారు. కృష్ణా జలాలను వివాదాలు లేకుండా వినియోగించుకుంటామని కేంద్రం ముందు ఒప్పందం చేసుకున్నారని, కృష్ణా జలాల్లో ఏపీ 66శాతం, 34 శాతం తెలంగాణ వాడుకుంటామని సంతకాలు చేశారని అన్నారు. ఇప్పుడు ఓట్లకోసం మాట మార్చారని, కొత్తగా 50 శాతం వాడుకుంటామని కేసీఆర్ మాట్లాడటం హాస్యాస్పదం అని అన్నారు. అంటే ఏడేళ్లపాటు కేవలం 34శాతం నీటితో తెలంగాణకు అన్యాయం జరిగిందని, అది తెలంగాణ ప్రభుత్వం వల్లేనని కేసీఆర్ ఒప్పుకున్నేట్టేకదా అని లాజిక్ తీశారు,

జగన్ జీవో తెచ్చినప్పుడు, రాయలసీమ ఎత్తిపోతల పనులు మొదలుపెట్టినప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం మాట్లాడలేదని, కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తేవడం వల్లే కేసీఆర్ మాట్లాడటం మొదలు పెట్టారని చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతలకు వ్యతిరేకంగా.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ని ఓ ప్రైవేటు వ్యక్తి ఆశ్రయించడం వల్లే ఆ తర్వాత వేసిన పిటిషన్లో ప్రభుత్వం ఇంప్లీడ్ అయిందని గుర్తు చేశారు.

కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ మీటింగ్ ని వాయిదా వేయాలని కేసీఆర్ కోరడం సరికాదని చెప్పారు రేవంత్ రెడ్డి. మీటింగ్ కు వెళ్లకుండా రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యా లు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. కేసీఆర్ బిజీగా ఉంటే, కడియంనో, తుమ్మలనో పంపించాలని సూచించారు. తన మీద కోపంతో కొడంగల్ నారాయణ పేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను కేసీఆర్ విస్మరించారని చెప్పారు రేవంత్ రెడ్డి. పాత ప్రాజెక్టులు పూర్తి చేసుంటే.. జగన్ కేంద్రానికి లేఖలు రాసే అవకాశం ఉండేది కాదని అన్నారు. జులై 9న కేసీఆర్ కెఆర్ఎంబి సమావేశానికి హాజరై వాదనలు వినిపించక పోతే జగన్ కు లొంగిపోయినట్లే అనుకోవాలని అన్నారు. కృష్ణా నీటిలో తెలంగాణ వాటా కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కేసీఆర్, కేటీఆర్ ఆమరణ దీక్ష చేయాలని సూచించారు రేవంత్ రెడ్డి.

Tags:    
Advertisement

Similar News