ఏకగ్రీవాల పోస్ట్ మార్టంకు హైకోర్టు బ్రేక్..

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు బ్రేకులు వేసింది. ఎక్కడ ఆగాయో, అక్కడినుంచే పరిషత్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామంటూనే ఏకగ్రీవాల విషయంలో మెలిక పెట్టారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. గతంలో నామినేషన్ దాఖలు సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నవారు, బలతవంతంగా ఉపసంహరించుకున్నవారికి మరోసారి అవకాశం ఇస్తామని, దానిపై కలెక్టర్లు విచారణ చేపట్టాలని ఆదేశాలిచ్చారు. ఈనెల 18న ఆదేశాలిచ్చి, 20లోపు కలెక్టర్లు నివేదిక ఇవ్వాలని డెడ్ లైన్ కూడా పెట్టారు. అయితే ఏకగ్రీవంగా గెలుపొందిన కొంతమంది అభ్యర్థులు […]

Advertisement
Update: 2021-02-19 21:38 GMT

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు బ్రేకులు వేసింది. ఎక్కడ ఆగాయో, అక్కడినుంచే పరిషత్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామంటూనే ఏకగ్రీవాల విషయంలో మెలిక పెట్టారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. గతంలో నామినేషన్ దాఖలు సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నవారు, బలతవంతంగా ఉపసంహరించుకున్నవారికి మరోసారి అవకాశం ఇస్తామని, దానిపై కలెక్టర్లు విచారణ చేపట్టాలని ఆదేశాలిచ్చారు. ఈనెల 18న ఆదేశాలిచ్చి, 20లోపు కలెక్టర్లు నివేదిక ఇవ్వాలని డెడ్ లైన్ కూడా పెట్టారు. అయితే ఏకగ్రీవంగా గెలుపొందిన కొంతమంది అభ్యర్థులు ఈ విషయాన్ని హైకోర్టులో సవాల్ చేయడంతో ఎస్ఈసీకి వ్యతిరేకంగా కోర్టు ఆదేశాలిచ్చింది.

ఒకే ఒక నామినేషన్‌ దాఖలైన చోట ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తూ ఎన్నికల అధికారి ఫాం- 10 జారీ చేసిన ఏకగ్రీవాలపై ఈ నెల 23వతేదీ వరకు ఎలాంటి విచారణ జరపొద్దని, ఎన్నికల కమిషన్ ను, అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఏకగ్రీవాన్ని ధృవీకరిస్తూ ఫాం- 10 జారీ చేయని చోట ఏవైనా చర్యలు తీసుకుంటే ఈ నెల 23 వరకు వెల్లడించొద్దని సూచించింది. ఈ నెల 23కి విచారణ వాయిదా వేసింది.

ఏకగ్రీవాల తేనెతుట్టెను కదపడం ఎందుకు..?
లాక్ డౌన్ కి ముందు మొదలైన పరిషత్ ఎన్నికల్లో 2248 ఎంపీటీసీలు, 125 జడ్పీటీసీలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే వీటిపై అప్పట్లోనే ఎన్నికల కమిషనర్ అభ్యంతరం తెలిపారు. తీరా ఇప్పుడు, నామినేషన్లు వేయనివారికి మరో అవకాశం అనే సరికి ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులు ఎదురు తిరిగారు. మరో అవకాశం ఇవ్వడం అంటే, గతంలో జరిగిన ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేయడమేనంటూ కోర్టుకెక్కారు. రాజ్యాంగంలోని అధికరణ 243-కె కింద ఆ అధికారం ఎన్నికల కమిషన్ కి ఉందని.. వాదనలు వినిపించినా.. కోర్టు వాటిని తోసిపుచ్చింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ధృవీకరణపై కమిషన్ కు సమీక్షించే అధికారం లేదని స్పష్టం చేసింది. గతంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇచ్చిన ధృవీకరణ పత్రాలే ఫైనల్ అని చాలా సందర్భాల్లో కోర్టులు తీర్పునిచ్చాయి. వాటిపై సమీక్షించడానికి పరాజితులైన అభ్యర్థులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరలేదు. ఇప్పుడు కూడా ఆర్వోల నిర్ణయమే ఫైనల్ అనేలా హైకోర్టు తీర్పునిచ్చింది. మొత్తమ్మీద ఏకగ్రీవాలు, నామినేషన్ల ఉపసంహరణ విషయంలో గందరగోళం నెలకొనే అవకాశాన్ని హైకోర్టు అడ్డుకున్నట్టయింది.

Tags:    
Advertisement

Similar News