నిహారిక కోసం డెస్టినేషన్ వెడ్డింగ్

మెగా డాటర్ నిహారిక కొణెదల పెళ్లికి తేదీ, వేదిక ఖరారైంది. వచ్చేనెల 9న నిహారిక-చైతన్య పెళ్లి జరగనుంది. ఈ పెళ్లికి రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ను వేదికగా ఎంచుకున్నారు. ఆగస్ట్ లో నిహారిక-చైతన్య నిశ్చితార్థం జరిగింది. ఆ వేడుక హైదరాబాద్ లోనే జరగడంతో, పెళ్లి కూడా హైదరాబాద్ లోనే జరుగుతుందని అనుకున్నారు. కానీ డెస్టినేషన్ వెడ్డింగ్ లో భాగంగా రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఉన్న ఉదయ్ విలాస్ రిసార్ట్స్ లో పెళ్లి చేయాలని […]

Advertisement
Update: 2020-11-04 08:50 GMT

మెగా డాటర్ నిహారిక కొణెదల పెళ్లికి తేదీ, వేదిక ఖరారైంది. వచ్చేనెల 9న నిహారిక-చైతన్య పెళ్లి జరగనుంది. ఈ పెళ్లికి రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ను వేదికగా ఎంచుకున్నారు.

ఆగస్ట్ లో నిహారిక-చైతన్య నిశ్చితార్థం జరిగింది. ఆ వేడుక హైదరాబాద్ లోనే జరగడంతో, పెళ్లి కూడా హైదరాబాద్ లోనే జరుగుతుందని అనుకున్నారు. కానీ డెస్టినేషన్ వెడ్డింగ్ లో భాగంగా రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఉన్న ఉదయ్ విలాస్ రిసార్ట్స్ లో పెళ్లి చేయాలని మెగా కుటుంబం నిర్ణయించింది.

ఈరోజు చైతన్య జొన్నలగడ్డ తల్లిదండ్రులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలి శుభలేఖను స్వామివారి సన్నిధిలో ఉంచారు. ఈ సందర్భంగా పెళ్లికి సంబంధించిన వివరాల్ని వాళ్లు బయటపెట్టారు.

Advertisement

Similar News