కరోనా నుంచి కోలుకున్న బాలు

లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా నుంచి కోలుకున్నారు. పరీక్షల్లో ఆయనకు ఈసారి నెగెటివ్ వచ్చింది. దీంతో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే నెగెటివ్ వచ్చినప్పటికీ బాలు ఆరోగ్యం ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. ఇప్పటికీ ఆయనకు వెంటిలేటర్ పైనే ఆక్సిజన్ అందిస్తున్నారు. వైరస్ వల్ల ఆయన ఊపిరితిత్తులు బాగా ప్రభావితం అయ్యాయి. కాబట్టి లంగ్స్ రికవరీ అయ్యేంత వరకు వెంటిలేటర్ ద్వారానే ఆక్సిజన్ అందిస్తామని వైద్యులు స్పష్టంచేశారు. లైఫ్ సపోర్ట్ తప్పితే, […]

Advertisement
Update: 2020-09-07 10:00 GMT

లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా నుంచి కోలుకున్నారు. పరీక్షల్లో ఆయనకు ఈసారి నెగెటివ్ వచ్చింది. దీంతో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అయితే నెగెటివ్ వచ్చినప్పటికీ బాలు ఆరోగ్యం ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. ఇప్పటికీ ఆయనకు వెంటిలేటర్ పైనే ఆక్సిజన్ అందిస్తున్నారు. వైరస్ వల్ల ఆయన ఊపిరితిత్తులు బాగా ప్రభావితం అయ్యాయి. కాబట్టి లంగ్స్ రికవరీ అయ్యేంత వరకు వెంటిలేటర్ ద్వారానే ఆక్సిజన్ అందిస్తామని వైద్యులు స్పష్టంచేశారు.

లైఫ్ సపోర్ట్ తప్పితే, బాలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. నిన్న ఆయన తన పెళ్లి రోజును కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. ఐపాడ్ లో క్రికెట్, టెన్నిస్ చూస్తున్నారు. రాస్తున్నారు, చదువుతున్నారు కూడా. ఇలానే ఆయన ఆరోగ్యం మెరుగైతే మరో 2 రోజుల్లో ఐసీయూ నుంచి జనరల్ లార్డుకు షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.

Advertisement

Similar News