రెండోటెస్టులో సఫారీలకు ఇంగ్లండ్ షాక్

స్టోక్స్ ఆల్ రౌండ్ ప్రతిభతో 189 పరుగులవిజయం ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా సౌతాఫ్రికా- ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగుమ్యాచ్ ల సిరీస్ నీకొకటి నాకొకటి అన్నట్లుగా సాగుతోంది. కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ వేదికగా ముగిసిన రెండోటెస్ట్ ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ 189 పరుగుల తేడాతో ఆతిథ్య సౌతాఫ్రికాను చిత్తు చేసి 1-1తో సమఉజ్జీగా నిలిచింది. మ్యాచ్ నెగ్గాలంటే రెండో ఇన్నింగ్స్ లో 438 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన […]

Advertisement
Update: 2020-01-07 23:50 GMT
  • స్టోక్స్ ఆల్ రౌండ్ ప్రతిభతో 189 పరుగులవిజయం

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా సౌతాఫ్రికా- ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగుమ్యాచ్ ల సిరీస్ నీకొకటి నాకొకటి అన్నట్లుగా సాగుతోంది.

కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ వేదికగా ముగిసిన రెండోటెస్ట్ ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ 189 పరుగుల తేడాతో ఆతిథ్య సౌతాఫ్రికాను చిత్తు చేసి 1-1తో సమఉజ్జీగా నిలిచింది.

మ్యాచ్ నెగ్గాలంటే రెండో ఇన్నింగ్స్ లో 438 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన సఫారీటీమ్ ఆఖరిరోజు ఆటలో 248 పరుగులకే కుప్పకూలింది.

ఓపెనర్ మలన్ 84, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ బెన్ స్టోక్స్ 50 పరుగుల స్కోర్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 3 వికెట్లు, డెన్లే, యాండర్సన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఇంగ్లండ్ విజయంలో ప్రధానపాత్ర వహించిన బెన్ స్టోక్స్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

సెంచూరియన్ వేదికగా జరిగిన తొలిటెస్టులో నెగ్గిన సౌతాప్రికాకు…న్యూలాండ్స్ టెస్ట్ లో మాత్రం పరాజయం తప్పలేదు. సిరీస్ లోని మూడోటెస్ట్ మ్యాచ్ పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జనవరి 16న ప్రారంభమవుతుంది.

Tags:    
Advertisement

Similar News