ఫస్ట్ క్లాస్ క్రికెటర్లకూ ఇక కాంట్రాక్టు విధానం

బీసీసీఐ చైర్మన్ గంగూలీ మదిలో ఆలోచన దేశవాళీ క్రికెటర్లకు మంచిరోజులొచ్చాయి. ఫస్ట్ క్లాస్ క్రికెటర్లకూ త్వరలో కాంట్రాక్టు విధానం ప్రవేశపెట్టే ఆలోచన ఉన్నట్లు బీసీసీఐ సరికొత్త అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు బాగుంటేనే భారత క్రికెట్ సైతం బాగుంటుందని సౌరవ్ గంగూలీ భావిస్తున్నాడు. ఇప్పటి వరకూ భారత క్రికెటర్లకు మాత్రమే అమలు చేస్తున్న సెంట్రల్ కాంట్రాక్టు విధానాన్ని ఫస్ట్ క్లాస్ క్రికెటర్లకు సైతం వర్తింప చేస్తామని…అప్పుడే దేశవాళీ క్రికెటర్లకు తగిన ఆర్థిక భద్రత ఉంటుందని […]

Advertisement
Update: 2019-10-31 00:05 GMT
  • బీసీసీఐ చైర్మన్ గంగూలీ మదిలో ఆలోచన

దేశవాళీ క్రికెటర్లకు మంచిరోజులొచ్చాయి. ఫస్ట్ క్లాస్ క్రికెటర్లకూ త్వరలో కాంట్రాక్టు విధానం ప్రవేశపెట్టే ఆలోచన ఉన్నట్లు బీసీసీఐ సరికొత్త అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించాడు.

ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు బాగుంటేనే భారత క్రికెట్ సైతం బాగుంటుందని సౌరవ్ గంగూలీ భావిస్తున్నాడు. ఇప్పటి వరకూ భారత క్రికెటర్లకు మాత్రమే అమలు చేస్తున్న సెంట్రల్ కాంట్రాక్టు విధానాన్ని ఫస్ట్ క్లాస్ క్రికెటర్లకు సైతం వర్తింప చేస్తామని…అప్పుడే దేశవాళీ క్రికెటర్లకు తగిన ఆర్థిక భద్రత ఉంటుందని దాదా అంటున్నాడు.

దేశవాళీ క్రికెటర్లకు అమలు చేసే కాంట్రాక్టు విధానాన్ని రూపొందించమని ఆర్థిక వ్యవహారాల ఉపసంఘాన్ని కోరినట్లు సౌరవ్ గంగూలీ తెలిపాడు.

రోజుకు 35వేల రూపాయలు మాత్రమే…

ప్రస్తుతం ..దేశవాళీ క్రికెటర్లు ఆడే మ్యాచ్ లను బట్టి ఏడాదికి 25 లక్షల రూపాయల నుంచి 30 లక్షల రూపాయల వరకూ ఆర్జిస్తున్నారు. రంజీట్రోఫీ, దులీప్ ట్రోఫీ మ్యాచ్ లు ఆడే క్రికెటర్లకు రోజుకు 35వేల రూపాయల చొప్పున చెల్లిస్తున్నారు. దీనికి రోజువారీ భత్యాన్ని అదనంగా కూడా ఇస్తున్నారు.

అదే…కాంట్రాక్టు విధానం అమలు చేస్తే…ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు భారీమొత్తంలో ఆర్జించడం ద్వారా గతంలో ఎన్నడూ లేనంత ఆర్థిక భద్రతతో క్రికెట్ పైనే దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది.

దేశవాళీ క్రికెట్లో సైతం…ఆటగాళ్ల స్థాయిని బట్టి…గ్రేడింగ్ విధానం అమలు చేయటానికి ముహూర్తం కుదిరినట్లే మరి.

Tags:    
Advertisement

Similar News