దొరికిపోయిన రేవంత్.. పరువు తీసిన బీఆర్ఎస్

కాంగ్రెస్ హామీలు ఫేక్, వారి పాలన ఫేక్, మాటలు ఫేక్.. చివరికి సోషల్ మీడియా పోస్టులు కూడా ఫేక్.. అంటూ ధ్వజమెత్తారు బీఆర్ఎస్ నేతలు.

Advertisement
Update: 2024-04-30 11:25 GMT

గోబెల్ మళ్లీ పుట్టారంటూ రేవంత్ రెడ్డి వేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. గతేడాది కూడా ఉస్మానియా యూనివర్శిటీ హాస్టళ్లకి నీళ్లు, కరెంటు కోత కారణంగానే సెలవలు ఇచ్చారేమో అని అంతా అనుకున్నారు. స్వయానా సీఎం వేసిన ట్వీట్ కావడం, పైగా ఆయన యూనివర్శిటీ చీఫ్ వార్డెన్ ఇచ్చిన నోటీస్ ని కూడా ట్వీట్ కి జతచేయడంతో ఎవ్వరికీ అనుమానం రాలేదు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అసలు విషయం బయటపెట్టింది. ఫేక్ నోటీస్ ని రేవంత్ రెడ్డి తన ట్విట్టర్లో పెట్టారంటూ అసలు నోటీస్ ని బయటపెట్టింది. రేవంత్ రెడ్డి పరువు తీసింది.


అసలేమైంది..?

కరెంటు, నీటి కొరత కారణంగా ఉస్మానియా యూనివర్శిటీ హాస్టల్ కి సెలవలు ఇస్తున్నట్టు వార్డెన్ ఇటీవల సర్కులర్ జారీ చేశారు. రాష్ట్రంలో నీటి కరువు, కరెంటు కోతల పరిస్థితి ఎలా ఉందో ఈ సర్కులర్ చూస్తే అర్థమవుతుందంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ట్వీట్ వేశారు. ఈ ట్వీట్ కి రియాక్ట్ అయిన రేవంత్ రెడ్డి.. గతంలో కేసీఆర్ హయాంలో కూడా ఇదే జరిగిందని, కానీ కొత్తగా తమపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. గోబెల్ మళ్లీ పుట్టారంటూ ఎద్దేవా చేశారు.

కాసేపటికే సీన్ రివర్స్ అయింది. రేవంత్ రెడ్డి ట్విట్టర్లో పోస్ట్ చేసిన నోటీస్ అసలైంది కాదని, ఫేక్ అని బీఆర్ఎస్ ఆధారాలతో సహా బయటపెట్టింది. అబద్ధానికి అంగీ లాగు వేస్తే అది నువ్వేనంటూ రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చింది. గుంపు మేస్త్రీ, గోబెల్స్ గురించి మాట్లాడటం.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని పేర్కొంది. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఒక సోషల్ మీడియా ట్రోల్ లాగా ఫేక్ సర్కులర్ పోస్ట్ చేయడానికి కొంచెమైనా సిగ్గు, శరం, మానం, అభిమానం ఉండాలంటూ ఘాటుగా ట్వీట్ వేశారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ హామీలు ఫేక్, వారి పాలన ఫేక్, మాటలు ఫేక్.. చివరికి సోషల్ మీడియా పోస్టులు కూడా ఫేక్.. అంటూ ధ్వజమెత్తారు. 

Tags:    
Advertisement

Similar News