ఢిల్లీ నుంచి ఫోన్ కాల్.. అందుకే మోదీ ఫొటో లేదు

కూటమిలో ముగ్గురు ఉన్నా మోదీ ఫోటో పెట్టుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు జగన్.

Advertisement
Update: 2024-04-30 12:44 GMT

ఈరోజు ఏపీలో కూటమి మేనిఫెస్టో విడుదల పెద్ద మిస్టరీగా మారింది. కూటమిలో బీజేపీ ఉన్నా.. మేనిఫెస్టోతో ఆ పార్టీకి సంబంధం లేదని తేలిపోయింది. ఆ మేనిఫెస్టో విడుదలకోసం వేసిన పోస్టర్ లో, మేనిఫెస్టో బ్రోచర్ లో కూడా ప్రధాని మోదీ ఫొటో లేదు, కనీసం కమలం పువ్వు గుర్తు కూడా లేదు. ప్రజాగళం అంటూ పవన్, బాబు మాత్రమే దాన్ని పట్టుకుని ఫొటోలు దిగారు. ఇక ఈ మేనిఫెస్టోపై సీఎం జగన్ వెంటనే స్పందించారు. మేనిఫెస్టో బ్రోచర్ పై మోదీ ఫొటో ఎందుకు లేదో జగన్ వివరించారు.

ఢిల్లీనుంచి ఫోన్..

మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నా.. మేనిఫెస్టోపై మోదీ బొమ్మ లేదన్నారు జగన్. వాస్తవానికి మొదట మోదీ బొమ్మ కూడా ఉందని, ఆ తర్వాత ఢిల్లీ నుంచి వారికి ఫోన్ కాల్ వచ్చిందని, మోదీ ఫోటో మేనిఫెస్టోలో పెట్టవద్దని వారు చెప్పారని, అందుకే కూటమి మోదీ ఫొటో లేకుండా మేనిఫెస్టో రిలీజ్ చేసిందని వివరించారు జగన్. మేనిఫెస్టో ప్రకటన కూడా అందుకే ఆలస్యమైందన్నారు. కూటమిలో ముగ్గురు ఉన్నా మోదీ ఫోటో పెట్టుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు.

వారికి విశ్వసనీయత లేదు..

వైసీపీ మేనిఫెస్టోకు కౌంటర్ గా వారు కూడా లిస్ట్ చదువుతున్నారని అంతే తప్ప అందులో ఇంకేమీ లేదన్నారు జగన్. తమ లిస్ట్‌లో స్కీమ్ లు ఉన్నాయని, వారి లిస్ట్ లో స్కామ్ లు ఉన్నాయన్నారు. మేనిఫెస్టో ప్రకటన పేరుతో తనని తిట్టడానికి, అబద్ధాలు చెప్పడానికే వారు ప్రయారిటీ ఇచ్చారన్నారు. జగన్ ను ఎందుకు చంపకూడదంటూ దారుణంగా మాట్లాడుతున్నారని, వారి సంస్కారానికి నా నమస్కారం అన్నారాయన. పాత మేనిఫేస్టోలో అమలు చేసిందేమీ లేదని, మరి కొత్త మేనిఫేస్టో ఎందుకని ప్రశ్నించారు. ఇంటింటికి ఎవరు మంచి చేశారు, ఎవరు ప్రజల్ని మోసం చేశారనేది అందరికీ తెలుసన్నారు జగన్. 

Tags:    
Advertisement

Similar News