ప్రపంచకప్ కు భారతజట్టులో సంజు శాంసన్, చహాల్ !

2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే 15మంది సభ్యుల భారతజట్టును బీసీసీఐ ఎంపిక సంఘం ప్రకటించింది. రోహిత్ కెప్టెన్ గా, హార్థిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు.

Advertisement
Update: 2024-04-30 11:39 GMT

2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే 15మంది సభ్యుల భారతజట్టును బీసీసీఐ ఎంపిక సంఘం ప్రకటించింది. రోహిత్ కెప్టెన్ గా, హార్థిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు.

వెస్టిండీస్, అమెరికా దేశాల సంయుక్త ఆతిథ్యంలో జరిగే 2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టుకు డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడు. మీడియం పేస్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాను వైస్ కెప్టెన్ గా ఎంపిక సంఘం ప్రకటించింది.

చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ జట్టు వివరాలను ప్రకటించింది.

రాహుల్ అవుట్..సంజు శాంసన్ కు చాన్స్....

భారతజట్టులో ప్రధాన వికెట్ కీపర్ బ్యాటర్ స్థానానికి రిషభ్ పంత్ ఎంపికయ్యాడు. బ్యాకప్ వికెట్ కీపర్ స్థానాన్ని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ దక్కించుకొన్నాడు. రాహుల్ తో పోటీపడిన సంజు చివరకు సెలెక్టర్లను మెప్పించగలిగాడు.

లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్ సైతం తిరిగి ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించాడు.

శుభ్ మన్ గిల్ కు మొండి చేయి....

యువబ్యాటర్ శుభ్ మన్ గిల్ భారతజట్టులో చోటు సంపాదించలేకపోయాడు. ప్రస్తుత ఐపీఎల్ లో గిల్ స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోడం ప్రపంచకప్ అవకాశాలను దెబ్బతీసింది.

కాగా..ముంబై ఆల్ రౌండర్ శివం దూబేకు జట్టులో చోటు దక్కింది. ఫినిషర్ గా పేరున్న రింకూ సింగ్ ను ఎంపిక సంఘం పక్కన పెట్టింది. స్పిన్ ఆల్ రౌండర్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ఇద్దరూ ఎంపిక కావడం విశేషం.

రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ కు సైతం ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. జూన్ నెలలో టీ-20 ప్రపంచకప్ కు తెరలేవనుంది.

ఇదీ భారతజట్టు-

రోహిత్ శర్మ(కెప్టెన్ ), హార్థిక్ పాండ్యా ( వైస్ కెప్టెన్ ), యశస్వీ జైశ్వాల్, విరాట్ కొహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ ( వికెట్ కీపర్ ), సంజు శాంసన్ ( వికెట్ కీపర్ ), శివం దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహాల్, అర్షదీప్ సింగ్, జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

రిజర్వ్ ఆటగాళ్లు- శుభ్ మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్.

Tags:    
Advertisement

Similar News