మే నెలలో రాబోతున్న మొబైల్స్ ఇవే..

మే నెలలో అతి తక్కువ బడ్జెట్ మొబైల్స్ నుంచి మిడ్‌రేంజ్, ఫ్లాగ్‌షిప్ రేంజ్‌ మొబైల్స్ వరకూ రకరకాల మోడల్స్‌ లాంఛ్ అవ్వనున్నాయి. మొబైళ్ల లిస్ట్, ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే.

Advertisement
Update: 2024-04-30 12:41 GMT

ఎప్పటిలాగానే వచ్చే నెలలో కూడా మోటొరోలా, వన్‌ప్లస్, పిక్సెల్ వంటి బ్రాండ్స్ నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ మొబైల్స్ ఇండియన్ మార్కెట్లో రిలీజవ్వబోతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దామా..

మే నెలలో అతి తక్కువ బడ్జెట్ మొబైల్స్ నుంచి మిడ్‌రేంజ్, ఫ్లాగ్‌షిప్ రేంజ్‌ మొబైల్స్ వరకూ రకరకాల మోడల్స్‌ లాంఛ్ అవ్వనున్నాయి. మొబైళ్ల లిస్ట్, ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే.

మోటో ఈ14

‘మోటో ఈ14’ మొబైల్‌.. యునీసాక్ టీ606 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. ఇందులో 6.5-అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంటుంది.ఇది 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఉండే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 20 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. కెమెరాల విషయానికొస్తే వెనుకవైపు 13 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు ముందువైపు 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ధర సుమారు రూ. 6,000 ఉంటుంది.

ఐకూ జెడ్ 9 ఎక్స్

‘ఐకూ జెడ్ 9 ఎక్స్’ మొబైల్.. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. ఇందులో 6.72-అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. కెమెరాల విషయానికొస్తే వెనుకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 2ఎంపీ డెప్త్ సెన్సర్, ముందువైపు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ధర సుమారు రూ. 13,000 ఉండొచ్చు.

వివో వీ30 ఈ

వచ్చే నెల 2న ‘వివో వీ30ఈ’ మొబైల్ లాంఛ్ అవ్వనుంది. ఈ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. ఇందులో 6.78-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఉండే 5500 ఎంఏహెచ్ బ్యాటరీ.. 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. కెమెరాల విషయానికొస్తే వెనుకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 8 ఎంపీ వైడ్ యాంగిల్ సెన్సర్‌‌తో పాటు ముందువైపు 50 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ధర సుమారు రూ. 27,000 ఉండొచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55

శాంసంగ్ నుంచి వచ్చే నెలలో ‘గెలాక్సీ ఎఫ్55’ మొబైల్ లాంఛ్ కానుంది. ఈ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. ఇందులో 6.7-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఉండే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.. 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో వెనుకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 8 ఎంపీ వైడ్ యాంగిల్ సెన్సర్, 2 ఎంపీ డెప్త్ సెన్సర్ ఉంటాయి. ముందువైపు 50 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ధర సుమారు రూ. 28,000 ఉండొచ్చు.

 

వన్‌ప్లస్ నార్డ్ 4

‘వన్ ప్లస్ నార్డ్ 4’ మొబైల్.. స్నాప్‌డ్రాగన్ 7 + జెన్ 3 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. ఇందులో 6.74 -అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఉండే 5500 ఎంఏహెచ్ బ్యాటరీ.. 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. కెమెరాల విషయానికొస్తే వెనుకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 8 ఎంపీ వైడ్ యాంగిల్ సెన్సర్, ముందువైపు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ధర సుమారు రూ. 30,000 ఉండొచ్చు.

 

పోకో ఎఫ్ 6

పోకో నుంచి మే నెలలో ‘పోకో ఎఫ్ 6’ మొబైల్ రిలీజవ్వనుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. ఇందులో 6.67 -అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఉండే 5500 ఎంఏహెచ్ బ్యాటరీ.. 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ లో వెనుకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 8 ఎంపీ వైడ్ యాంగిల్ సెన్సర్, ముందువైపు 20 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ధర సుమారు రూ. 35,000 ఉండొచ్చు.

గూగుల్ పిక్సెల్ 8ఎ

వచ్చే నెలలోనే ‘గూగుల్ పిక్సె్ల్ 8ఎ’ మొబైల్ కూడా లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మొబైల్ గూగుల్ టెన్సర్ జీ3 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. ఇందులో 6.1-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఉండే 4500 ఎంఏహెచ్ బ్యాటరీ.. 27 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 7.5 వాట్ వైర్‌‌లెస్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో వెనుకవైపు 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 13 వైడ్ యాంగిల్ సెన్సర్, ముందువైపు 13 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ధర సుమారు రూ. 45,000 ఉండొచ్చు.

 

Tags:    
Advertisement

Similar News