ఇండియాలో గూగుల్ వాలెట్ రిలీజ్! ఎలా వాడుకోవచ్చంటే..

జేబులో పెట్టుకునే పర్సు మాదిరిగా మొబైల్‌లో ముఖ్యమైన డాక్యుమెంట్లు, డబ్బు దాచుకునేందుకు వీలుగా గూగుల్ ‘వాలెట్’ అనే యాప్‌ను రూపొందించింది.

Advertisement
Update: 2024-05-10 06:15 GMT

జేబులో పెట్టుకునే పర్సు మాదిరిగా మొబైల్‌లో ముఖ్యమైన డాక్యుమెంట్లు, డబ్బు దాచుకునేందుకు వీలుగా గూగుల్ ‘వాలెట్’ అనే యాప్‌ను రూపొందించింది. ఇప్పుడిది ఇండియాలో అందుబాటులోకి వచ్చింది. ఇదెలా పనిచేస్తుందంటే..

గూగుల్ వాలెట్ యాప్ ప్రపంచవ్యాప్తంగా ఎప్పటినుంచో అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు ఈ యాప్ ఇండియన్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఇందులో కార్డులు, డాక్యుమెంట్లతో పాటు పేమెంట్ సర్వీసులు కూడా పొందొచ్చు.

గూగుల్ వాలెట్‌ అనేది ఒక డిజిటల్ వాలెట్. ఇందులో పేటియం, ఫోన్ పే మాదిరిగా వాలెట్‌లో మనీ యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇందులో ట్రావెల్ కార్డులు, మూవీ టికెట్లు, ఐడీ కార్డుల వంటి వాటిని కూడా సేఫ్‌గా భద్రపరచుకోవచ్చు.

ఫ్లైట్ టికెట్ల నుంచి క్రెడిట్ కార్డ్‌ల వరకూ మొబైల్‌లో సేఫ్‌గా దాచుకోవాల్సిన వాటన్నింటినీ ఇందులో సేవ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మూవీ టికెట్లు, ట్రైన్ టికెట్ల వంటివాటిని ప్రతిసారీ ఆయా యాప్స్‌లోకి వెళ్లి వెతికే పని లేకుండా ఒకే చోట దాచుకోవచ్చన్న మాట. దాచుకున్నవాటికి ఈవెంట్ ప్రకారం డేట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్లైట్ టికెట్లను వాలెట్‌లో దాచుకుంటే జర్నీ డేట్‌ను బట్టి రిమైండర్ అందిస్తుంది. అలాగే ఈవెంట్ అయిపోయిన వెంటనే వాలెట్ నుంచి రిమూవ్ కూడా అవుతుంది.

గూగుల్ వాలెట్‌ను పేమెంట్స్‌కు కూడా వాడుకోవచ్చు. కార్డ్‌ల నుంచి గూగుల్‌ వ్యాలెట్‌కు కొంత డబ్బుని యాడ్ చేసుకుని ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. అయితే సర్వీస్ పరంగా ఒకేలా ఉన్నా దీనికి గూగుల్‌పే కి కొంత తేడా ఉంటుంది. గూగుల్‌పే కేవలం పేమెంట్స్‌కు పనికొస్తే.. ఇది అదనంగా వాలెట్ సేవలను కూడా అందిస్తుంది.

Tags:    
Advertisement

Similar News