Google Pixel 8a | గూగుల్ జెమినీ ఏఐ అసిస్టెంట్‌తో గూగుల్ పిక్సెల్ 8ఏ.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..!

Google Pixel 8a | గూగుల్ పిక్సెల్ 8ఏ (Google Pixel 8a) ఫోన్ 1080 x 2400 రిజొల్యూష‌న్‌, 430పీపీఐతోపాటు 6.1 అంగుళాల ఓలెడ్ యాక్చువా డిస్‌ప్లే క‌లిగి ఉంటుంది. గూగుల్ పిక్సెల్ 7ఏ (Google Pixel 7a) కంటే గూగుల్ పిక్సెల్ 8ఏ (Google Pixel 8a) ఫోన్ 40 శాతం బ్రైట్‌గా ఉంటుంది.

Advertisement
Update: 2024-05-08 08:45 GMT

Google Pixel 8a | గూగుల్ (Google) త‌న గూగుల్ పిక్సెల్ 8ఎ (Google Pixel 8a) స్మార్ట్‌ఫోన్‌ను భార‌త్ మార్కెట్లో ఆవిష్కరించిన ఫ్యాన్స్‌ను ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది. గూగుల్ ఐ/ఓ ఈవెంట్ త‌ర్వాత చాలా కాలానికి గూగుల్ పిక్సెల్ 8ఏ (Google Pixel 8a) ఫోన్‌ను ముందుగా నిర్ణ‌యించిన షెడ్యూల్ ప్ర‌కారం వ‌చ్చేవారం ఆవిష్క‌రించాల్సి ఉంది. కానీ వారం ముందే మార్కెట్‌లో ఆవిష్క‌రించిన గూగుల్ పిక్సెల్ 8ఏ (Google Pixel 8a) ఇంట‌ర్నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇంత‌కుముందు తీసుకొచ్చిన గూగుల్ పిక్సెల్ 7ఏ (Google Pixel 7a) డిజైన్ య‌ధాత‌థంగా వ‌స్తున్నా, కొన్ని మార్పులు చేశారు. గూగుల్ పిక్సెల్ 8ఏ (Google Pixel 8a) ఫోన్‌లో బిల్ట్ ఇన్ జెమినీ ఏఐ అసిస్టెంట్‌తోపాటు ప‌లు ఏఐ ఫీచ‌ర్లు జ‌త చేశారు.

గూగుల్ పిక్సెల్ 8ఏ (Google Pixel 8a) ఫోన్ 1080 x 2400 రిజొల్యూష‌న్‌, 430పీపీఐతోపాటు 6.1 అంగుళాల ఓలెడ్ యాక్చువా డిస్‌ప్లే క‌లిగి ఉంటుంది. గూగుల్ పిక్సెల్ 7ఏ (Google Pixel 7a) కంటే గూగుల్ పిక్సెల్ 8ఏ (Google Pixel 8a) ఫోన్ 40 శాతం బ్రైట్‌గా ఉంటుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌తో వ‌స్తున్న‌ది. 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వ‌స్తుంది. 16 మిలియ‌న్ల క‌ల‌ర్స్ కోసం ఫుల్ 24-బిట్ డెప్త్, హెచ్‌డీఆర్ మ‌ద్ద‌తుతోపాటు ప‌లు డిస్‌ప్లే ఫీచ‌ర్లు ఉంటాయి.

గూగుల్ పిక్సెల్ 8ఏ (Google Pixel 8a) ఫోన్ రౌండెడ్ ఎడ్జ్‌ల‌తో యూజువ‌ల్ పంచ్‌హోల్ డిస్‌ప్లేతో వ‌స్తుంది. థిక్ హారిజొంట‌ల్ స్ట్రాప్ హౌసింగ్ టూ సెన్స‌ర్స్‌తోపాటు విల‌క్ష‌ణ‌మైన కెమెరా మాడ్యూల్ ఉంటుంది. మ్యాట్టె ఫినిష్‌తోపాటు పాలిష్డ్ అల్యూమినియం ఫ్రేమ్‌తో బ్యాక్ ప్యానెల్ రూపొందించారు.

గూగుల్ టెన్స‌ర్ జీ3 చిప్ సెట్‌, టైటాన్ ఎం2 సెక్యూరిటీ కో ప్రాసెస‌ర్ ఉంటాయి. డ్యుయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్‌తో గూగుల్ పిక్సెల్ 8ఏ (Google Pixel 8a) వ‌స్తోంది. 64-మెగా పిక్సెల్ మెయిన్ లెన్స్ కెమెరా, 13-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ లెన్స్ కెమెరా, లార్జ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 13-మెగా పిక్సెల్స్ కెమెరా ఉంటాయి.

గూగుల్ పిక్సెల్ 8ఏ (Google Pixel 8a) ఫోన్ టైప్‌-సీ చార్జింగ్ మ‌ద్ద‌తుతోపాటు 4492 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ ఉంటుంది. రిటైల్ బాక్స్‌లో చార్జ‌ర్ కూడా అంద‌జేస్తారు. ఏడేండ్ల పాటు ఓఎస్, సెక్యూరిటీ, ఫీచ‌ర్ డ్రాప్ అప్‌డేట్స్ అందిస్తుంది. వాట‌ర్ అండ్ డ‌స్ట్ రెసిస్టెన్స్‌పై ఐపీ67 రేటింగ్ అందుకున్న‌ది.

గూగుల్ పిక్సెల్ 8ఏ (Google Pixel 8a) ఫోన్ నాలుగు రంగుల వేరియంట్లు - అలోయ్‌, బే, ఒబ్సిడియ‌న్‌, పోర్సెలియ‌న్ రంగుల్లో ల‌భిస్తుంది. 128 జీబీ, 256 జీబీ స్టోరేజీ వేరియంట్ల‌లో అందుబాటులో ఉంటుంది. గూగుల్ పిక్సెల్ 8ఏ (Google Pixel 8a) ఫోన్ 128 జీబీ స్టోరేజీ వ‌ర్ష‌న్ రూ.52,999, 256 జీబీ స్టోరేజీ వ‌ర్స‌న్ రూ.59,999ల‌కు ల‌భిస్తుంది. గూగుల్ పిక్సెల్ 7ఏ ఫోన్ రూ.43,999 నుంచి ప్రారంభ‌మైంది. గూగుల్ పిక్సెల్ 8ఏ (Google Pixel 8a) ఫోన్ కోసం ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ ఆర్డ‌ర్ బుక్ చేసుకోవ‌చ్చు. ఈ నెల 14 ఉద‌యం 6.30 గంట‌ల నుంచి గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్ సేల్స్ ప్రారంభం అవుతాయి.

Tags:    
Advertisement

Similar News