ఈ వారం ఓటీటీ చెక్ లిస్ట్: షైతాన్ తో బాటు సంజయ్ లీలా భంసలీ కొత్త సిరీస్!

రాబోయే ఏడు రోజుల్లో మరిన్ని వెరైటీల సినిమాలు, టీవీ షోలు స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యాయి. వీటిలో అజయ్ దేవగణ్, ఆర్. మాధవన్ లు నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘షైతాన్’ థియేట్రికల్ గా విజయం సాధించిన తర్వాత డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైంది.

Advertisement
Update: 2024-04-30 10:38 GMT

తాజా ఓటీటీ విడుదలల వారంవారీ అప్‌డేట్స్ తెలుసుకుందాం... రాబోయే ఏడు రోజుల్లో మరిన్ని వెరైటీల సినిమాలు, టీవీ షోలు స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యాయి. వీటిలో అజయ్ దేవగణ్, ఆర్. మాధవన్ లు నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘షైతాన్’ థియేట్రికల్ గా విజయం సాధించిన తర్వాత డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైంది. రాబిన్ లీ శృంగార నవల ఆధారంగా ‘ది ఐడియా ఆఫ్ యూ’, అలాగే సంజయ్ లీలా భన్సాలీ కొత్త పీరియడ్ సిరీస్ ‘హీరా మండీ : ది డైమండ్ బజార్’ ఈ వారం ప్రత్యేకం. ఇవి గాక ఏప్రిల్ 29 - మే 5 మధ్య ఇంకా ఏఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయో ఈ క్రింద చూద్దాం..

1. ది హోల్డోవర్స్ (ఏప్రిల్ 29) అమెజాన్ ప్రైమ్

ఈ అలెగ్జాండర్ పేన్ దర్శకత్వం వహించిన ఈ కామెడీలో ఒక వయసు మళ్ళిన కాలేజీ ఇన్స్ స్ట్రక్టర్ క్రిస్మస్ సెలవుల్లో విద్యార్థుల్ని చూసుకోవడానికి నియమితుడవుతాడు. ఈ కథ ముందుకు సాగుతున్నప్పుడు, అతను సమస్యాత్మక విద్యార్థుల్లో ఒకరితో, ఇంకా వియత్నాం యుద్ధంలో కొడుకుని కోల్పోయిన కాలేజీ ప్రధాన కుక్‌తోనూ అసాధ్యమైన సంబంధాన్ని ఏర్పర్చుకునేందుకు పాట్లు పడతాడు.

2. ఫియాస్కో (ఏప్రిల్ 30) నెట్‌ఫ్లిక్స్

కొత్తగా సినిమా దర్శకత్వం చేపట్టిన రాఫెల్ వాలాండే అనే అతడి దృష్టికోణంలో సినిమా నిర్మాణంలో తలెత్తే గందరగోళ పరిస్థితుల్ని ఇది చిత్రిస్తుంది. ఈ కథనం చరిత్రపూర్వ కాలం నుంచి రెండవ ప్రపంచ యుద్ధం వరకు సాగుతుంది. సినిమా సెట్స్ లో ప్రమాదాలు, వ్యక్తిగత వివాదాలు, తగాదాలు పెరిగిపోయి దిక్కుతోచని పరిస్థితి తలెత్తుతుంది. ఈ పరిస్థితిని మరింత విషమంగా మార్చే శక్తిగా ఒకడు పావులు కదుపుతూ వుంటాడు...

3. ది వీల్ (ఏప్రిల్ 30) డిస్నీ+ హాట్‌స్టార్‌

గ్రిప్పింగ్ థ్రిల్లర్ సిరీస్ ఇది. ఇస్తాంబుల్, పారిస్, లండన్‌లలో ఇద్దరు మహిళలు ఒక కుట్రలో ఇరుక్కుంటారు. ఇందులోంచి బయటపడేందుకు ఒకరు కీలక రహస్యాన్ని దాచిపెడుతూంటే, మరొకరు దానిని బహిర్గతం చేయడానికి ప్రయత్నిస్తారు. బహిర్గతం చేస్తే పరిణామాలు వేలాది మందిని ప్రభావితం చేయగలవు. అంతర్జాతీయ గూఢచర్యం నేపథ్యంగా సాగే ఈ కథలో అమెరికా, ఫ్రాన్స్ గూఢచారులు కూడా జొరబడి ఆ ఇద్దరు మహిళల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తారు.

4. హీరా మండీ : ది డైమండ్ బజార్ (మే 1) నెట్ ఫ్లిక్స్

ప్రసిద్ధ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సిరీస్. ఈ పీరియడ్ డ్రామా కథాంశం లాహోర్‌లోని రెడ్-లైట్ జిల్లా హీరా మండీ కి చెందిన మల్లికాజాన్ తోబాటు, ఆమె వేశ్యల చుట్టూ తిరుగుతుంది. వీరు బ్రిటిష్-పాలిత భారతదేశంలో తిరుగుబాటు కారణంగా ముప్పుని ఎదుర్కొంటారు. ఈ సిరీస్‌లో మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ వంటి బాలీవుడ్ తారాగణం వుంది.

Full View


5. అకాపుల్కో సీజన్ 3 (మే 1) ఆపిల్ టీవీ ప్లస్

అకాపుల్కో సీజన్ 3 మాక్సిమో గల్లార్డో అనే అతడి జీవితాన్ని వివిధ కాలాల ద్వారా అన్వేషిస్తుంది. ఈ సీజన్ 1985లో యువకుడుగా వున్నప్పుడు మాక్సిమో ఆశయాల్ని, వాటితో పెనవేసుకున్న శృంగార కార్యకలాపాలనీ చిత్రిస్తుంది.

6. టి. పి. బాన్ (మే 2) నెట్ ఫ్లిక్స్

ఈ యానిమేషన్ లో ఒక సాధారణ ఉన్నత పాఠశాల విద్యార్థి టైం పెట్రోల్ అని పిలిచే టైమ్-ట్రావెలింగ్ స్క్వాడ్‌లో సభ్యుడిగా చేరి సాహస యాత్ర చేస్తాడు. ప్రపంచవ్యాప్తంగా వివిధ సమయాల్లో, ప్రదేశాల్లో ప్రయాణిస్తూ కీలకమైన చారిత్రక ఘటనల నుంచి ప్రజల్ని రక్షిస్తాడు. అతనూ అతడి సహచరులు ఈ టైమ్ ట్రావెల్లో అనేక చిక్కుల్ని విడదీస్తూ, తమ సంకల్పాన్ని పరీక్షించుకుంటూ సాగిపోతారు.

7. ది ఐడియా ఆఫ్ యూ (మే 2) అమెజాన్ ప్రైమ్

సామాజిక నిబంధనల్ని సవాలు చేసే హృదయపూర్వక రోమ్-కామ్ ఇది. 40 ఏళ్ళ సింగిల్ మదర్ 24 ఏళ్ళ పాప్ సెన్సేషన్ కుర్రాడితో ప్రేమలో పడిపోతుంది. ఇద్దరూ కలిసి ఆ అందమైన బంధాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు, సమాజం నుంచి కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి. ఇదే పేరుతో రాబిన్ లీ రాసిన నవలకి ఇది అనుకరణ.

8. షైతాన్ (మే 3) నెట్ ఫ్లిక్స్

వికాస్ బహల్ దర్శకత్వం వహించిన మనోహరమైన సూపర్ నేచురల్ థ్రిల్లర్. ఇందులో అజయ్ దేవగణ్, ఆర్. మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించారు. మంచి చెడుల మధ్య తీవ్ర పోరాటానికి దారితీసే మాయాజాలంలో చిక్కుకున్న కుటుంబ కథని ఈ మూవీ వివరిస్తుంది. అజయ్ దేవగణ్ తన కుటుంబాన్ని రక్షించడానికి నిశ్చయించుకున్న కుటుంబ పెద్ద అయితే, మాధవన్ అతడి ఇంట్లోకి చొరబడి అతడి కుమార్తెని హిప్నటైజ్ చేసే దుష్ట శక్తి.

9. వాంకా (మే 3) జియో సినిమా

ఇది అత్యాశతో కూడిన ఆధిపత్యంలో వున్న చాక్లెట్ పరిశ్రమ ప్రపంచంలోకి ప్రవేశించి, తన సృజనాత్మక ఆవిష్కరణలతో ప్రపంచాన్ని మార్చడంలో విజయం సాధించిన యువకుడి కథ.

10. ది టాటూయిస్ట్ ఆఫ్ ఆష్విట్జ్ (మే 3) జియో సినిమా

హీథర్ మోరిస్ నవలకి అనుసరణ. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఆష్విట్జ్ నిర్బంధ శిబిరంలో తనను తాను కనుగొన్న స్లోవేకియన్ యూదుడి బాధాకర నిజ కథకి జీవం పోసే చిత్రణ.

11. ది ఎటిపికల్ ఫ్యామిలీ (మే 4) నెట్ ఫ్లిక్స్

దక్షిణ కొరియన్ కుటుంబ డ్రామా. ఇది బోక్ గ్వి-జూ, అతడి కుటుంబపు జీవితాల్ని అన్వేషిస్తుంది. కుటుంబంలో అందరికీ విలక్షణమైన ఏవో సామర్ధ్యాలుంటాయి. వాస్తవానికి బోక్ గ్వి-జూ తన జీవితంలోని సంతోషకర సమయాల్ని తిరిగి పొందేందుకు పోరాడుతున్నప్పుడు, తన సామర్థ్యాలు క్షీణిస్తున్నట్లు గుర్తిస్తాడు. నిద్రలేమితో బాటు స్మార్ట్ ఫోన్ వ్యసనం వంటి సమకాలీన సవాళ్లతో పోరాడుతున్నప్పుడు, అతడి కుటుంబ సభ్యులు కూడా తమ శక్తులు తగ్గిపోతున్నట్టు గుర్తిస్తారు. ఇంతలో దో డా-హే అనే ఓ అపరిచిత మహిళ ప్రవేశించి ఆ సంక్లిష్ట కుటుంబ జీవితంలో భాగమైనప్పుడు, ఊహించని మార్పులు, సవాళ్ళు సంభవిస్తాయి

12. బ్లాక్ మాఫియా ఫ్యామిలీ సీజన్ 3 (మే 5) లయన్స్ గేట్ ప్లే

నిజ కథ నుంచి ప్రేరణ పొందిన ఈ డ్రామా డెట్రాయిట్‌కి చెందిన ఇద్దరు సోదరుల కథని చెబుతుంది, ఈ ఇద్దరూ 1980ల చివర్లో అత్యంత పవర్ఫుల్ డ్రగ్ కార్టెల్స్ గా అవతరిస్తారు. ఈ వారం బ్లాక్ మాఫియా ఫ్యామిలీ కొత్త సీజన్‌లో వీళ్ళు కొత్త సవాళ్ళనీ, ప్రత్యర్థుల్నీ ఎదుర్కోవడం చూడవచ్చు.

Tags:    
Advertisement

Similar News