రజినీకాంత్ తో గౌతమ్ మీనన్ !

ఈ మధ్యనే ‘పెట్ట’ సినిమాతో తమిళంలో సూపర్ హిట్ అందుకున్న రజినీకాంత్…. ప్రస్తుతం ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ అనే సినిమాలో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా పూర్తయిన తర్వాత రజినీకాంత్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. నిజానికి గౌతమ్ మీనన్ రజినీకాంత్ హీరోగా ఒక సినిమా చేయాలని ఎప్పటినుంచో […]

Advertisement
Update: 2019-09-25 04:08 GMT

ఈ మధ్యనే ‘పెట్ట’ సినిమాతో తమిళంలో సూపర్ హిట్ అందుకున్న రజినీకాంత్…. ప్రస్తుతం ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ అనే సినిమాలో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది.

తాజాగా ఈ సినిమా పూర్తయిన తర్వాత రజినీకాంత్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. నిజానికి గౌతమ్ మీనన్ రజినీకాంత్ హీరోగా ఒక సినిమా చేయాలని ఎప్పటినుంచో ట్రై చేస్తున్నాడు.

‘తలైవా’ అనే ఒక స్క్రిప్టుని రాసిన గౌతమ్ మీనన్ ఆ సినిమాని కేవలం రజనీకాంత్ తో మాత్రమే తీయాలని అనుకున్నాడు. కానీ కుదరలేదు.

ఇన్నాళ్ళకి ‘దర్బార్’ సినిమా విడుదలైన తర్వాత ఈ స్క్రిప్టు వింటానని రజినీకాంత్ చెప్పాడట. ఒకవేళ రజినీకాంత్ కి కథ నచ్చితే ఈ సినిమా వచ్చే ఏడాది లాంచ్ కానుంది.

మరోవైపు గౌతమ్ మీనన్ విడుదలకు నోచుకోని తన సినిమాలను విడుదల చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ధనుష్ హీరోగా నటించిన ‘ఎనై నొక్కి పాయుం తోట’ మరియు ‘ధృవనక్షత్రం’ సినిమాలు త్వరలో విడుదల చేయబోతున్నాడు గౌతమ్ మీనన్.

Tags:    
Advertisement

Similar News