మహిళా పోలీసులను నిర్బంధించిన కేసులో చింతమనేని మళ్లీ అరెస్ట్

అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన వివాదాస్పద టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఆ ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఇప్పటికే ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులో ఈనెల 11న అరెస్ట్ అయిన చింతమనేని… జిల్లా జైలులో ఉన్నాడు. ఈనెల 11న చింతమనేని అరెస్ట్‌ చేసేందుకు ఆయన ఇంటికి పోలీసులు వెళ్లారు. ఆసమయంలో ఐదుగురు మహిళా పోలీసులు కూడా వెళ్లారు. ఆ సమయంలో చింతమనేని ఆదేశాలతో ఆయన అనుచరులు … మహిళా పోలీసులను బూతులు తిడుతూ తీసుకెళ్లి ఒక గదిలో బంధించారు. దీనిపై […]

Advertisement
Update: 2019-09-19 20:09 GMT

అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన వివాదాస్పద టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఆ ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఇప్పటికే ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులో ఈనెల 11న అరెస్ట్ అయిన చింతమనేని… జిల్లా జైలులో ఉన్నాడు.

ఈనెల 11న చింతమనేని అరెస్ట్‌ చేసేందుకు ఆయన ఇంటికి పోలీసులు వెళ్లారు. ఆసమయంలో ఐదుగురు మహిళా పోలీసులు కూడా వెళ్లారు. ఆ సమయంలో చింతమనేని ఆదేశాలతో ఆయన అనుచరులు … మహిళా పోలీసులను బూతులు తిడుతూ తీసుకెళ్లి ఒక గదిలో బంధించారు. దీనిపై వారు ఫిర్యాదు చేయడంతో చింతమనేని, ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు.

జైలులో ఉన్న చింతమనేనిని మహిళా కానిస్టేబుల్స్‌ను నిర్బంధించిన కేసులో ఏలూరు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి చింతమనేనికి అక్టోబర్ ఒకటి వరకు రిమాండ్ విధించారు. దాంతో చింతమనేనిని తిరిగి జిల్లా జైలుకు తరలించారు. చింతమనేనిపై మొత్తం 49 కేసులు ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News