ప్రపంచ సైక్లింగ్ లో భారత కుర్రాళ్ల జోరు

టీమ్ ట్రాక్ లో స్వర్ణం నెగ్గిన భారతజట్టు ప్రపంచ జూనియర్ సైక్లింగ్ చాంపియన్షిప్ లో భారత కుర్రాళ్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. ట్రాక్ సైక్లింగ్ విభాగంలో భారత్ కు తొలి బంగారు పతకం అందించిన ఘనతను ఎసో అల్బెన్, రొనాల్డో సింగ్, రోజెన్ సింగ్ లతో కూడిన జట్టు సొంతం చేసుకొంది. జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ వేదికగా జరిగిన 2019 జూనియర్ ప్రపంచ సైక్లింగ్ పోటీల టీమ్ ట్రాక్ విభాగంలో భారతజట్టు 44.681 సెకన్ల టైమింగ్ తో స్వర్ణ పతకం […]

Advertisement
Update: 2019-08-15 21:03 GMT
  • టీమ్ ట్రాక్ లో స్వర్ణం నెగ్గిన భారతజట్టు

ప్రపంచ జూనియర్ సైక్లింగ్ చాంపియన్షిప్ లో భారత కుర్రాళ్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. ట్రాక్ సైక్లింగ్ విభాగంలో భారత్ కు తొలి బంగారు పతకం అందించిన ఘనతను ఎసో అల్బెన్, రొనాల్డో సింగ్, రోజెన్ సింగ్ లతో కూడిన జట్టు సొంతం చేసుకొంది.

జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ వేదికగా జరిగిన 2019 జూనియర్ ప్రపంచ సైక్లింగ్ పోటీల టీమ్ ట్రాక్ విభాగంలో భారతజట్టు 44.681 సెకన్ల టైమింగ్ తో స్వర్ణ పతకం సొంతం చేసుకొంది. ఫైనల్లో ఆస్ట్ర్లేలియా జట్టుపై సంచలన విజయం సాధించింది.

హోరాహోరీగా సాగిన టైటిల్ సమరం తొలిరౌండ్లో .244 సెకన్లతో వెనుకబడిన భారతజట్టు రెండోరౌండ్లో 0.030 సెకన్ల సమయంతో పుంజుకోగలిగింది.

ఇక… నిర్ణయాత్మక ఆఖరిరౌండ్లో భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి..తొలిసారిగా బంగారు పతకం అందుకొంది.

ప్రపంచ సైక్లింగ్ చరిత్రలోనే భారతజట్టు అందుకొన్న తొలి స్వర్ణం ఇదే కావడం విశేషం. ఆస్ట్ర్రేలియా రజత, ఇంగ్లండ్ కాంస్య పతకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

భారత 73వ స్వాతంత్ర్యదినోత్సం రోజునే కుర్రాళ్లు బంగారు పతకాన్ని దేశానికి కానుకగా ఇచ్చి సంచలనం సృష్టించారు.

Tags:    
Advertisement

Similar News