చంద్రబాబుపై స్పీకర్ అసహనం....

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సమయాన్ని వృధా చేస్తున్నారని.. సబ్జెక్ట్‌లోనికి రావాలని స్పీకర్ తమ్మినేని సీతారాం కోరారు. దీంతో చంద్రబాబు.. నలబై ఏళ్ల రాజకీయ అనుభవం నాకు ఉంది అంటూ సమాధానం ఇవ్వడంతో స్పీకర్ అసహనానికి గురయ్యారు. ఆయనపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష సభ్యులు సభా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. నలభై ఏళ్ళ అనుభవం ఉన్నా ప్రశ్నకు సంబంధం లేని విషయాలు […]

Advertisement
Update: 2019-07-18 06:05 GMT

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సమయాన్ని వృధా చేస్తున్నారని.. సబ్జెక్ట్‌లోనికి రావాలని స్పీకర్ తమ్మినేని సీతారాం కోరారు. దీంతో చంద్రబాబు.. నలబై ఏళ్ల రాజకీయ అనుభవం నాకు ఉంది అంటూ సమాధానం ఇవ్వడంతో స్పీకర్ అసహనానికి గురయ్యారు. ఆయనపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

విపక్ష సభ్యులు సభా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. నలభై ఏళ్ళ అనుభవం ఉన్నా ప్రశ్నకు సంబంధం లేని విషయాలు మాట్లాడరాదని ఆయన సూచించారు. ఇదే విషయాన్ని పదే పదే చెబుతూనే ఉన్నానని ఆయన అన్నారు. మా మొర ఆలకించండి అని విపక్ష సభ్యులు, ప్రతిపక్ష నాయకుడు అంటున్నారు. నేను ఇక్కడ ఉన్నదే మొర ఆలకించడానికి.. మీరు సభా సమయాన్ని వృధా చేయవద్దని అన్నారు.

కాగా, చంద్రబాబు నాయుడు నదీపరివాహక ప్రాంత అక్రమ కట్టడాల గురించి మాట్లాడుతూ.. మీరు కూల్చాలనుకుంటే రోడ్లపై ఉన్న గుడులు, విగ్రహాలు కూడా కూల్చాలని అనడంతో వైసీపీ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ విగ్రహాలను కూల్చాలని చంద్రబాబు అంటున్నారని వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కొద్ది సేపు వైసీపీ, టీడీపీ సభ్యులు సభలో పరస్పరం కేకలు వేస్తూ గందరగోళం సృష్టించారు.

అలా చేయకపోతే నేను ఇక్కడ ఉండటం అనవసరం : తమ్మినేని

ఈ రాష్ట్రంలో దళిత, మైనార్టీ వర్గాలకు సంబంధించిన మనోభావాలు ఉంటాయి. వారి హక్కులను కాపాడటం మన బాధ్యత. అలాగే నేను ఒక బీసీ వ్యక్తి అయినా నాకు సభాపతిగా అవకాశం ఇచ్చారు. నేను మీ అందరికి ఉన్న సభా హక్కులను కాపాడే అవసరం నాది. ప్రతీ ఒక్కరికి నేను న్యాయం చేయడానికే ఉన్నాను. అలా నేను చేయలేక పోతే ఇక్కడ ఉండటం అనవసరం అంటూ స్పీకర్ తమ్మినేని ఉద్వేగంగా మాట్లాడారు.

Tags:    
Advertisement

Similar News