అక్టోబర్‌ 15 నుంచి రైతులకు ఏటా 12,500.... వైఎస్సార్‌ రైతు భరోసా

సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని అమలు చేయడానికి సిద్ధమయ్యారు. తాడేపల్లి లో జరిగిన సమీక్షా సమావేశంలో…. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. అక్టోబర్‌ 15 నుంచి రైతు భరోసా పథకం ప్రారంభిస్తున్నట్లు జగన్ ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ. 12,500 ఇవ్వబోతున్నట్లు చెప్పారు. అంతేకాకుండా రైతులకు కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 3 వేల కోట్ల రూపాయలతో […]

Advertisement
Update: 2019-06-06 02:40 GMT

సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని అమలు చేయడానికి సిద్ధమయ్యారు. తాడేపల్లి లో జరిగిన సమీక్షా సమావేశంలో…. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా పథకం అమలుకు శ్రీకారం చుట్టారు.

అక్టోబర్‌ 15 నుంచి రైతు భరోసా పథకం ప్రారంభిస్తున్నట్లు జగన్ ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ. 12,500 ఇవ్వబోతున్నట్లు చెప్పారు.

అంతేకాకుండా రైతులకు కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 3 వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.

రైతులకు బీమా సౌకర్యం అందించే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు వైఎస్‌ జగన్‌. ప్రీమియం కూడా పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు ఆయన. ఎన్నికలకు మూడు నెలల ముందు గత చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేసింది.

తాడేపల్లి లో జరిగిన సమీక్షా సమావేశంలో జగన్‌ ఈ నిర్ణయాలతో పాటు…. నకిలీ విత్తనాల చలామణిపై సీరియస్‌ గా స్పందించారు. నకిలీ విత్తనాలు విక్రయించేవారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలిచ్చారు. నాణ్యమైన విత్తనాలను గ్రామ సచివాలయాల ద్వారా పంపిణీ చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా అధికారులు విత్తన చట్టంలో మార్పుల గురించి సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో జగన్‌ అసెంబ్లీలో చర్చించి కొత్త చట్టం తీసుకువద్దామని అధికారులతో అన్నారు.

వ్యవసాయ అవసరాలకు గ్రామ సచివాలయాలు కేంద్రంగా పనిచేయాలని, ప్రభుత్వ సేవలపై రైతులకు నమ్మకం కలిగించాలని అధికారులతో అన్నారు వైఎస్‌ జగన్‌.

పాదయాత్ర సమయంలో వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఐదెకరాల లోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు రూ.50వేలు ఇస్తామని ప్రకటించారు. ఖరీఫ్‌ ప్రారంభంలో పెట్టుబడి కోసం వెతుక్కొనే అవసరం లేకుండా ఏటా రూ. 12,500 చొప్పున నాలుగేళ్ల పాటు ఇస్తామన్నారు.

అంతేకాకుండా ధరల తగ్గుదల, తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తులతో రైతు నష్టపోకుండా ఆదుకునేందుకు రూ. మూడు కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.రెండు వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధిని కూడా ఏర్పాటు చేస్తామని జగన్‌ చెప్పారు. ఇప్పుడు దానిని అమలు చేయడానికి శ్రీకారం చుట్టారు.

Tags:    
Advertisement

Similar News