సమంతా వద్దంటే.... అనుపమను తీసుకునేవాళ్ళట!

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా హిట్ అయిన సంగతి తెలిసిందే. నాన్ ‘బాహుబలి’ రికార్డును బ్రేక్ చేసిన ‘రంగస్థలం’ సినిమా లో రామ్ చరణ్ చెవిటి వాడైన చిట్టిబాబు పాత్రలో కనిపించాడు. ఈ సినిమాలో రామలక్ష్మి పాత్రలో సమంత నటించింది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. నిజానికి సుకుమార్ ముందుగా సమంతాను ఈ పాత్ర కోసం సంప్రదించినప్పటికీ…. సమంత […]

Advertisement
Update: 2019-04-28 00:26 GMT

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా హిట్ అయిన సంగతి తెలిసిందే. నాన్ ‘బాహుబలి’ రికార్డును బ్రేక్ చేసిన ‘రంగస్థలం’ సినిమా లో రామ్ చరణ్ చెవిటి వాడైన చిట్టిబాబు పాత్రలో కనిపించాడు. ఈ సినిమాలో రామలక్ష్మి పాత్రలో సమంత నటించింది.

అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. నిజానికి సుకుమార్ ముందుగా సమంతాను ఈ పాత్ర కోసం సంప్రదించినప్పటికీ…. సమంత ఈ సినిమాను ఒప్పుకోవాలా లేదా అని కన్ఫ్యూజన్ లో ఉందట.

అప్పుడే సమంత, నాగ చైతన్య ల పెళ్లి సమయం కావడంతో ఈ పాత్ర గురించి నిర్ణయం తీసుకోవడానికి టైం తీసుకుందట. కానీ ఈ స్క్రిప్ట్ విన్న వెంటనే సమంతా సినిమాకు ఓకే చెప్పేసిందట.

ఒకవేళ సమంత అప్పుడు ఈ పాత్రను తిరస్కరించి ఉంటే సుకుమార్ ఈ సినిమా కోసం అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా తీసుకుందామని అనుకున్నాడట.

ఇక తాజాగా ‘మజిలీ’ సినిమాతో హిట్ అందుకున్న సమంత త్వరలో ‘ఓ బేబీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News