టీడీపీతో పొత్తు లేదని దమ్ముంటే దేవుడిపై ప్రమాణం చేయ్‌ పవన్‌ " హర్షకుమార్

ఏపీలో టీడీపీ-జనసేన కలిసి పనిచేస్తున్నాయని మాజీ ఎంపీ హర్షకుమార్‌ వ్యాఖ్యానించారు. జనసేన, బీఎస్పీ, వామపక్షాల సీట్లలో అభ్యర్థులను కూడా చంద్రబాబే ఎంపిక చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబుతో పొత్తు లేదని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పే దమ్ము పవన్‌ కల్యాణ్‌కు ఉందా? అని ప్రశ్నించారు. టికెట్ ఇస్తానని చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారని…. కానీ లిస్ట్‌ లో పేరు లేదన్నారు. టీడీపీ కండువా కప్పుకున్నప్పటి నుంచి తన మనసు భారంగానే ఉందన్నారు. ఐదేళ్లలో దళితులపై టీడీపీ నేతలు అనేక దాడులు చేశారన్నారు. రిలయన్స్ ఒత్తిడి మేరకు తనకు చంద్రబాబు […]

Advertisement
Update: 2019-03-21 22:04 GMT

ఏపీలో టీడీపీ-జనసేన కలిసి పనిచేస్తున్నాయని మాజీ ఎంపీ హర్షకుమార్‌ వ్యాఖ్యానించారు. జనసేన, బీఎస్పీ, వామపక్షాల సీట్లలో అభ్యర్థులను కూడా చంద్రబాబే ఎంపిక చేస్తున్నారని చెప్పారు.

చంద్రబాబుతో పొత్తు లేదని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పే దమ్ము పవన్‌ కల్యాణ్‌కు ఉందా? అని ప్రశ్నించారు. టికెట్ ఇస్తానని చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారని…. కానీ లిస్ట్‌ లో పేరు లేదన్నారు.

టీడీపీ కండువా కప్పుకున్నప్పటి నుంచి తన మనసు భారంగానే ఉందన్నారు. ఐదేళ్లలో దళితులపై టీడీపీ నేతలు అనేక దాడులు చేశారన్నారు. రిలయన్స్ ఒత్తిడి మేరకు తనకు చంద్రబాబు టికెట్ ఇవ్వలేదన్నారు.

తిరిగి ఫోన్ చేసి రాజ్యసభ సీటు ఇస్తానని చంద్రబాబు చెప్పారని.. కానీ చంద్రబాబును మరోసారి తాను నమ్మబోనని అందుకే టీడీపీని వీడి బయటకు వచ్చినట్టు చెప్పారు.

Advertisement

Similar News