అల్లు అరవింద్.... నిర్మాణ రంగం నుంచి తప్పుకోనున్నారా?

ఇప్పటికే మెగా కాంపౌండ్ నుంచి టాలీవుడ్ లోకి హీరోలుగా చాలా మందే వచ్చారు. వారందరికీ గీత ఆర్ట్స్ హోమ్ బ్యానర్ లాంటిది అని చెప్పుకోవచ్చు. తన కెరీర్ లో ఇప్పటికే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చాలా హిట్ చిత్రాలను అందించారు. కేవలం మెగా హీరోలతో నే కాక బయట హీరోలతో కూడా సినిమాలు చేసి బోలెడు హిట్ లను అందుకున్నారు. అంతేకాక గత కొంతకాలంగా జీఏ 2 (గీత ఆర్ట్స్ 2) పేరుతో ఏర్పాటైన మరొక […]

Advertisement
Update: 2019-03-20 00:32 GMT

ఇప్పటికే మెగా కాంపౌండ్ నుంచి టాలీవుడ్ లోకి హీరోలుగా చాలా మందే వచ్చారు. వారందరికీ గీత ఆర్ట్స్ హోమ్ బ్యానర్ లాంటిది అని చెప్పుకోవచ్చు. తన కెరీర్ లో ఇప్పటికే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చాలా హిట్ చిత్రాలను అందించారు. కేవలం మెగా హీరోలతో నే కాక బయట హీరోలతో కూడా సినిమాలు చేసి బోలెడు హిట్ లను అందుకున్నారు.

అంతేకాక గత కొంతకాలంగా జీఏ 2 (గీత ఆర్ట్స్ 2) పేరుతో ఏర్పాటైన మరొక అనుబంధ సంస్థకు ఊతమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిర్మాణ వ్యవహారాలు చాలా వరకు బన్నివాసు చూసుకుంటున్నారు.

అయితే ఇలా నెమ్మదిగా నిర్మాణ వ్యవహారాల నుంచి అల్లు అరవింద్ పక్కకు తప్పుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికీ ఆయన చేతిలో కొన్ని పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి.

తెలుగులో అగ్ర హీరోలతో చేయవలసిన కొన్ని సినిమాలు ఉన్నాయి. అవి పూర్తి కావడానికి కనీసం ఒకటి లేదా రెండు సంవత్సరాలు పడుతుంది. ఆ పనులను పూర్తి చేసి అల్లు అరవింద్ దూరం అవనున్నారని తెలుస్తోంది.

ఇక తన నిర్మాణ బాధ్యతలు అన్ని తన తనయులకు అప్పగించాలని అల్లు అరవింద్ నిర్ణయించుకున్నారట. కాబట్టి మరికొన్నాళ్లలో అల్లు అరవింద్ కుమారులు గీత ఆర్ట్స్ ను టేక్ ఓవర్ చేసుకోనున్నారన్నమాట.

Tags:    
Advertisement

Similar News