కళ్యాణ్ దేవ్ సరసన బాలీవుడ్ భామ

గత ఏడాది “విజేత”  సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కళ్యాణ్ దేవ్. పేరుకే చిరంజీవి అల్లుడు, కానీ స్టార్ డైరెక్టర్స్ వెంట పడకుండా కొత్త దర్శకులకి అవకశాలు ఇస్తున్నాడు కళ్యాణ్ దేవ్. ఇక ఈ తరుణంలో కళ్యాణ్ దేవ్ తన తదుపరి సినిమాని పులి వాసు దర్శకత్వంలో చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ సరసన బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తి ని హీరోయిన్ గా ఫైనలైజ్ చేశారట. హిందీలో “హాఫ్ […]

Advertisement
Update: 2019-01-06 23:20 GMT

గత ఏడాది “విజేత” సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కళ్యాణ్ దేవ్. పేరుకే చిరంజీవి అల్లుడు, కానీ స్టార్ డైరెక్టర్స్ వెంట పడకుండా కొత్త దర్శకులకి అవకశాలు ఇస్తున్నాడు కళ్యాణ్ దేవ్. ఇక ఈ తరుణంలో కళ్యాణ్ దేవ్ తన తదుపరి సినిమాని పులి వాసు దర్శకత్వంలో చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ సరసన బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తి ని హీరోయిన్ గా ఫైనలైజ్ చేశారట.

హిందీలో “హాఫ్ గర్ల్ ‘ఫ్రెండ్” “బ్యాంక్ చోర్” ‘జలేబి’ లాంటి సినిమాలో నటించింది రియా. అలాగే ఈ భామ తెలుగులో కూడా ‘తూనీగా తూనీగా’ అనే సినిమా కూడా చేసింది. కానీ ఇప్పటి వరకు ఈ భామకి అటు బాలీవుడ్ లో గాని ఇటు టాలీవుడ్ లో గారి హీరోయిన్ గా సరైన గుర్తింపు దక్కలేదు. మరి ఇప్పుడు ఈ మెగా ఫ్యామిలీ ఆఫర్ తో అయిన ఈ అమ్మడు కెరీర్ పట్టలేక్కుతుందో లేదో చూడాలి. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి నుంచి షూటింగ్ కి వెళ్తుంది.

Tags:    
Advertisement

Similar News