మీటూ వల్ల భయపడ్డ రవితేజ

ఇటీవల కాలంలో మనకి బాగా వినిపిస్తున్న మాట మీటూ.చాలా కాలంగా కొనసాగుతున్న ఈ మీటూ ఉద్యమం ఇప్పిడిప్పుడే ముగుస్తోంది.తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వివాదం రేపుతోందని పలువురు తమ సమస్యని వెల్లడించారు. వారిలో మెయిన్ గా,గట్టిగా వినిపించిన పేరు శ్రీరెడ్డి. శ్రీరెడ్డి తనకి జరిగిన వాటిని సినీ వర్గాల వారికీ ఎంత మొరపెట్టుకున్నా ఎవరు పట్టించుకోలేదని, ఇక తనని ఎవరెవరు వేధించారో అని కొన్ని పేర్లు బయట పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. శ్రీరెడ్డి,మాధవి లత […]

Advertisement
Update: 2018-11-14 11:20 GMT

ఇటీవల కాలంలో మనకి బాగా వినిపిస్తున్న మాట మీటూ.చాలా కాలంగా కొనసాగుతున్న ఈ మీటూ ఉద్యమం ఇప్పిడిప్పుడే ముగుస్తోంది.తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వివాదం రేపుతోందని పలువురు తమ సమస్యని వెల్లడించారు. వారిలో మెయిన్ గా,గట్టిగా వినిపించిన పేరు శ్రీరెడ్డి.

శ్రీరెడ్డి తనకి జరిగిన వాటిని సినీ వర్గాల వారికీ ఎంత మొరపెట్టుకున్నా ఎవరు పట్టించుకోలేదని, ఇక తనని ఎవరెవరు వేధించారో అని కొన్ని పేర్లు బయట పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. శ్రీరెడ్డి,మాధవి లత మినహాయించి ఎవరు కూడా కాస్టింగ్ కౌచ్ గురించి తమ సమస్యలు చెప్పలేదు.

ఇన్ని సంవత్సరాల నుండి సినిమాలు చేస్తున్నాం ఎప్పుడు కూడా ఈ కాస్టింగ్ కౌచ్ అనేది మా వరకు రాలేదని అటు సినిమా హీరోయిన్స్ మరియు ఛాంబర్ ఫిలిం మెంబెర్స్ కూడా చెబుతున్నారు. అయినా సరే ఒకవేళ అలాంటివి ఎవరికైనా ఎదురైతే వెంటనే మాకు చెప్పండి అని ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు తెలిపారు. దీనితో ఎవరు కూడా ఇది చెప్పడానికి ముందుకు రావట్లేదు. ఒకవేళ వచ్చిన వారికి న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదని కొందరు వాపోతున్నారు.

రీసెంట్ గా “అమర్ అక్బర్ ఆంటోని”ప్రెస్ మీట్ లో రవితేజ ని మీడియా వారు, మీటూ గురించి అడగగా, మీటూ వల్ల ఇండస్ట్రీ లో అందరూ భయపడ్డారు నేను కూడా అని చెప్పారు. ఇప్పుడున్నట్టే సినీ పరిశ్రమ ఏ సమస్యలు లేకుండా హ్యాపీ గా ఉండాలని ఆయన అన్నారు. కాస్టింగ్ కౌచ్ లాంటిది ఇండస్ట్రీ లో లేదు అని అని తేల్చి చెప్పేసారు.

Tags:    
Advertisement

Similar News