అమరావతిలో వింత చేపల కలకలం.... ఎక్కడి నుంచి వచ్చాయి?

నవ్యాంధ్ర రాజధాని గ్రామాల్లో వింత చేపలు బయటపడుతున్నాయి.. ఈ విషయం ఆ నోటా ఈ నోటా ప్రచారం ఎక్కువగా జరగడంతో ఆ చేపలను చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు బారులు తీరారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం గ్రామం లోని కాలువల్లో మత్య్సకారులకు వింత చేపలు దర్శనమిచ్చాయి. గ్రామంలోని కొందరు యువకులు కాలవ గట్టుకెళ్ళి చేపలు పడుతుండగా వారి గాలానికి ఈ చేపలు చిక్కాయి. ఒళ్ళంతా పెద్ద ముళ్లతో, పెద్ద నోటితో, మూతికి పెద్ద మీసంలాంటి ఆకృతితో […]

Advertisement
Update: 2018-11-08 00:51 GMT

నవ్యాంధ్ర రాజధాని గ్రామాల్లో వింత చేపలు బయటపడుతున్నాయి.. ఈ విషయం ఆ నోటా ఈ నోటా ప్రచారం ఎక్కువగా జరగడంతో ఆ చేపలను చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు బారులు తీరారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం గ్రామం లోని కాలువల్లో మత్య్సకారులకు వింత చేపలు దర్శనమిచ్చాయి.

గ్రామంలోని కొందరు యువకులు కాలవ గట్టుకెళ్ళి చేపలు పడుతుండగా వారి గాలానికి ఈ చేపలు చిక్కాయి. ఒళ్ళంతా పెద్ద ముళ్లతో, పెద్ద నోటితో, మూతికి పెద్ద మీసంలాంటి ఆకృతితో వింతగా కనబడటంతో ఆశ్చర్యపోయారు. ఇటువంటి చేపలు ఎప్పుడూ ఈ పరిసరాల్లో చూడలేదని…. ఫోన్లతో ఫొటోలు, వీడియోలు తీయడం ప్రారంభించారు.

వీటిని ముట్టుకునేందుకు దగ్గరకు వెళ్ళినా చర్మానికి ఉన్న ముళ్ళతో గాయపరుస్తున్నాయి. ఈ చేపలు ఎక్కడివి, ఏ జాతివో అంతుపట్టడం లేదు. ఇవి తినటానికి కూడా ఉపయోగపడవని, ఒక రకమైన రాక్షస జాతి చేపలని స్థానికులంటున్నారు.

గతంలో కూడా కృష్ణానది పుష్కరాలప్పుడు ప్రకాశం బ్యారేజీ లోని నీటి లో సంచరించాయని, మత్స్యకారుల వలలను కొరికి తీరని నష్టం కలిగించాయని చెబుతున్నారు. అప్పుడు మత్య్సశాఖ అధికారులు కూడా పరిశీలించారు. ఇటువంటి రకాల చేపలు ఎక్కువగా సముద్రంలో సంచరిస్తాయని చెప్పారు.

మత్స్యకారుల వలలను కొరికి వారిని ఆర్థికంగా దెబ్బతీసి, స్థానికులను భయపెట్టి , కాలువలోకి దిగిన వారిని సైతం గాయపరిచే ఈ చేపల పట్ల అప్రమత్తంగా ఉండాలని పలువురు మత్య్సకారులు సూచిస్తున్నారు.

ఇవి క్యాట్ ఫిష్ చేపలని ఇంకొంత మంది చెబుతున్నారు. ఒకప్పుడు వీటి ఆనవాళ్లే లేని రాజధాని ప్రాంతంలోని కాలువలు, రిజర్వాయర్లలో ఇటువంటి చేపలు సంచరిస్తుండటంతో ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి ఇవి ఏ జాతివి, ఎంతవరకు ప్రమాదమో సామాన్యులకు తెలియజేయాలని కోరుతున్నారు.

Tags:    
Advertisement

Similar News