సవ్యసాచి టీజర్ రెడీ.. చైతూ పరిస్థితేంటి?

యాక్షన్ ఇమేజ్.. హీరో నాగచైతన్య.. ఈ రెండూ రెండు దిక్కలు. నాగచైతన్య ఇటు వైపు ఉంటే, యాక్షన్ ఇమేజ్ అతడికి ఆమడదూరంలో ఉంటుంది. యాక్షన్ మేకోవర్ కోసం ప్రయత్నించిన ప్రతిసారి ఫ్లాప్ తెచ్చుకున్నాడు నాగచైతన్య. అతడి ఫిల్మోగ్రఫీ చూస్తే ఎవరికైనా ఈ విషయం అర్థమైపోతుంది. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా చైతూ మాత్రం మినిమం గ్యాప్ లో యాక్షన్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా అదే పనిచేశాడు. చైతూ, చందు కాంబోలో సవ్యసాచి రెడీ అయిపోయింది. దసరా […]

Advertisement
Update: 2018-10-22 13:01 GMT

యాక్షన్ ఇమేజ్.. హీరో నాగచైతన్య.. ఈ రెండూ రెండు దిక్కలు. నాగచైతన్య ఇటు వైపు ఉంటే, యాక్షన్ ఇమేజ్ అతడికి ఆమడదూరంలో ఉంటుంది. యాక్షన్ మేకోవర్ కోసం ప్రయత్నించిన ప్రతిసారి ఫ్లాప్ తెచ్చుకున్నాడు నాగచైతన్య. అతడి ఫిల్మోగ్రఫీ చూస్తే ఎవరికైనా ఈ విషయం అర్థమైపోతుంది. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా చైతూ మాత్రం మినిమం గ్యాప్ లో యాక్షన్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా అదే పనిచేశాడు.

చైతూ, చందు కాంబోలో సవ్యసాచి రెడీ అయిపోయింది. దసరా మంచి రోజు కాబట్టి ఆరోజు నుంచి ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. టీజర్ ఇప్పటికే విడుదల చేశారు. ఎల్లుండి ఏకంగా ట్రయిలర్ విడుదల చేయబోతున్నారు. బుధవారం మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకు ముహూర్తం చూసి మరీ సవ్యసాచి థియేట్రికల్ ట్రయిలర్ విడుదల చేయబోతున్నారు.

అన్నీ పక్కాగా ముహూర్తాలు చూసి చేస్తున్నారు. మరి ఈ ముహూర్త బలమైనా నాగచైతన్యకు కలిసొస్తుందేమో చూడాలి. సవ్యసాచి హిట్ అయితే, అతడి కెరీర్ లో హిట్ అయిన మొట్టమొదటి యాక్షన్ సినిమా ఇదే అవుతుంది. వచ్చేనెల 2న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాలో చైతూ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.

Tags:    
Advertisement

Similar News