మధ్యాహ్న భోజన పథకం.... దారుణంగా ఏపీ ర్యాంక్

మధ్యాహ్న భోజన పథకం అమలులో ఆంధ్రప్రదేశ్‌ బాగా వెనుకబడింది. దేశంలో 13వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. డ్రాఫౌట్లను తగ్గించేందుకు, విద్యార్థులకు పౌష్టికాహరం అందించేందుకు ఈ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టగా ఏపీలో ఈ పథకం అమలు ఆశాజనకంగా లేదని నివేదిక తేల్చింది. మధ్యాహ్న భోజన పథకానికి కేంద్రం 10,500 కోట్లు కేటాయించింది. ఇప్పటి వరకు రూ. 2,824 కోట్లు విడుదల చేసింది. ఏపీకి 146 కోట్లు విడుదల చేసింది. మరిన్ని నిధులు విడుదలకు యూసీలను కేంద్రం కోరింది. అయితే వాటిని […]

Advertisement
Update: 2018-10-22 20:45 GMT

మధ్యాహ్న భోజన పథకం అమలులో ఆంధ్రప్రదేశ్‌ బాగా వెనుకబడింది. దేశంలో 13వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. డ్రాఫౌట్లను తగ్గించేందుకు, విద్యార్థులకు పౌష్టికాహరం అందించేందుకు ఈ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టగా ఏపీలో ఈ పథకం అమలు ఆశాజనకంగా లేదని నివేదిక తేల్చింది.

మధ్యాహ్న భోజన పథకానికి కేంద్రం 10,500 కోట్లు కేటాయించింది. ఇప్పటి వరకు రూ. 2,824 కోట్లు విడుదల చేసింది. ఏపీకి 146 కోట్లు విడుదల చేసింది. మరిన్ని నిధులు విడుదలకు యూసీలను కేంద్రం కోరింది. అయితే వాటిని పంపడంలో ఏపీ వెనుకబడింది.

పైగా మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన కిచెన్లు, స్టోరేజ్‌ గదుల నిర్మాణం కూడా ఏపీలో నత్తనడకన సాగుతోందని తేల్చారు. ఈ పథకం అమలులో అసోం , పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు ముందున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేయడం ఎలా అన్నది అసోం, పశ్చిమబెంగాల్‌ విధానాలను ప్రస్తావిస్తూ…. ఏపీకి ఆర్థిక శాఖ నివేదికలో పలు సూచనలు కూడా చేసింది.

Advertisement

Similar News