ఆ విషయంలో జగన్ నిర్మొహమాటంగా...?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు కొన్ని విషయాల్లో పూర్తి నిర్మొహమాటంగా మారిపోయినట్టుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేకించి ఎన్నికలు దగ్గరపడిన నేపథ్యంలో జగన్ అభ్యర్థుల ఖరారు విషయంలో కసరత్తు కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ కసరత్తులో జగన్ చాలా నిర్మొహమాటంగా వ్యవహరిస్తున్నట్టుగా సమాచారం. ఎంత నిర్మొహమాటంగా అంటే.. ఈ సారి అభిమానాల కొద్దీ, వ్యక్తులను చూసి టికెట్లు ఇచ్చే ప్రసక్తి లేదని జగన్ స్పష్టం చేస్తున్నాడట. ఎవరైతే గెలుస్తారు.. అనే అంశంపై […]

Advertisement
Update: 2018-10-18 02:30 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు కొన్ని విషయాల్లో పూర్తి నిర్మొహమాటంగా మారిపోయినట్టుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేకించి ఎన్నికలు దగ్గరపడిన నేపథ్యంలో జగన్ అభ్యర్థుల ఖరారు విషయంలో కసరత్తు కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ కసరత్తులో జగన్ చాలా నిర్మొహమాటంగా వ్యవహరిస్తున్నట్టుగా సమాచారం. ఎంత నిర్మొహమాటంగా అంటే.. ఈ సారి అభిమానాల కొద్దీ, వ్యక్తులను చూసి టికెట్లు ఇచ్చే ప్రసక్తి లేదని జగన్ స్పష్టం చేస్తున్నాడట.

ఎవరైతే గెలుస్తారు.. అనే అంశంపై తనకు వచ్చిన రిపోర్టులు, సర్వేలు, అధ్యయనాల ఆధారంగానే జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

ఎవరైనా ఓడిపోతారు.. వాళ్లకు టికెట్ ఇస్తే కష్టం.. అనే రిపోర్టులు వచ్చిన పక్షంలో జగన్ వారిని నిర్మొహమాటంగా పక్కన పెట్టేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో జగన్ తన, మన అనే మొహమాటానికి పోవడం లేదని తెలుస్తోంది.

ఇందులో భాగంగా జగన్ కు సన్నిహితులు కూడా టికెట్లు కోల్పోవడం ఖాయమనే మాట వినిపిస్తోంది. లేళ్ల అప్పిరెడ్డి జగన్ కు వీరాభిమాని. అయితే గత ఎన్నికల్లో లేళ్ల భారీ మెజారిటీతో తన సీటును టీడీపీకి అప్పగించాడు. అందుకే ఈ సారి జగన్ మోహన్ రెడ్డి లేళ్లకు నో టికెట్ అని స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. కేవలం లేళ్ల వరకే కాదు ఈ జాబితాలో మరి కొందరు ఉన్నట్టుగా తెలుస్తోంది.

వీరిలో ఆళ్ల వంటి సిట్టింగుకు కూడా జగన్ నో అని చెబుతున్నట్టుగా తెలుస్తోంది. నియోజకవర్గ పరిస్ధితులకు అనుగుణంగా జగన్ నడుచుకుంటున్నాడని.. స్థానిక పరిస్థితులతో నెగ్గుకుని వచ్చి గెలిచి, నిలవగలిగే వాళ్లకు మాత్రం జగన్ టికెట్ ఖరారు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో మొహమాటానికి పోయి కొన్ని టికెట్లు ఇచ్చి ఆ సీట్లను కోల్పోయాడు జగన్. ఈ సారి మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వనని అంటున్నాడట.

Advertisement

Similar News