ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా....

మరో నటుడు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. నటుడు జీవీ సుధాకర్‌ నాయుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జీవీ అప్పుడే ప్రచారం కూడా మొదలుపెట్టారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. ఐ లవ్ కూకట్‌పల్లి పేరుతో జీవీ సుధాకర్ నాయుడు ప్రచారం మొదలుపెట్టారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నానని.. త్వరలోనే పూర్తి స్థాయిలో సమావేశం నిర్వహించి మరిన్ని వివరాలు వెల్లడిస్తానని మీడియా సమావేశంలో వెల్లడించారు. […]

Advertisement
Update: 2018-09-22 00:57 GMT

మరో నటుడు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. నటుడు జీవీ సుధాకర్‌ నాయుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జీవీ అప్పుడే ప్రచారం కూడా మొదలుపెట్టారు.

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. ఐ లవ్ కూకట్‌పల్లి పేరుతో జీవీ సుధాకర్ నాయుడు ప్రచారం మొదలుపెట్టారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నానని.. త్వరలోనే పూర్తి స్థాయిలో సమావేశం నిర్వహించి మరిన్ని వివరాలు వెల్లడిస్తానని మీడియా సమావేశంలో వెల్లడించారు.

కులాలు, మతాల ఆధారంగా ఓట్లు వేయించుకుంటున్న నేతలకు గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. అటు ఆంధ్ర, ఇటు తెలంగాణలో పాలకులు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయారని విమర్శించారు. జీవీ ఇండిపెండెంట్ అభ్యర్థిగానే పోటీ చేసే అవకాశం ఉంది.

Advertisement

Similar News