ఏపీకి ఆర్థిక సాయం విడుదల!... కొండంత రాగం దీని కోసమేనా?

ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. మొత్తం రూ. 1976 కోట్లను విడుదల చేసింది. ఇందులో రెవెన్యూ లోటు భర్తీకి రూ. 1176కోట్లు, రాజధాని అభివృద్ధికి రూ. 450 కోట్లు, వెనుకబడిన జిల్లాలకు రూ. 350కోట్లు విడుదల చేసింది. కొద్ది రోజులుగా కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరిలు కేంద్రం ఆర్థిక ప్యాకేజ్‌పై కసరత్తు చేస్తోందని చెబుతూ వస్తున్నారు. రెండు రోజుల క్రితం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ కూడా చంద్రబాబుతో చర్చలు జరిపారని.. ప్యాకేజ్ […]

Advertisement
Update: 2016-08-18 03:27 GMT

ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. మొత్తం రూ. 1976 కోట్లను విడుదల చేసింది. ఇందులో రెవెన్యూ లోటు భర్తీకి రూ. 1176కోట్లు, రాజధాని అభివృద్ధికి రూ. 450 కోట్లు, వెనుకబడిన జిల్లాలకు రూ. 350కోట్లు విడుదల చేసింది. కొద్ది రోజులుగా కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరిలు కేంద్రం ఆర్థిక ప్యాకేజ్‌పై కసరత్తు చేస్తోందని చెబుతూ వస్తున్నారు. రెండు రోజుల క్రితం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ కూడా చంద్రబాబుతో చర్చలు జరిపారని.. ప్యాకేజ్ ప్రకటిస్తారని హడావుడి చేశారు. అది బీహార్‌కు ప్రకటించినట్టుగా లక్షా 25 కోట్ల రేంజ్లో ఉంటుందన్నట్టుగా హంగామా చేశారు. ఈ సమయంలోనే కేంద్రం రూ. 1976 కోట్లు విడుదల చేసింది. సుజనా చౌదరి, వెంకయ్య చెప్పిన ఆర్ధిక సాయం ఇదేనా లేకుంటే భారీగా ఆర్థిక ప్యాకేజ్‌ను విడిగా ప్రకటిస్తారా చూడాలి. గతంలో వెనుకబడిన జిల్లాలకు కేంద్రం అందించిన వందల కోట్ల రూపాయలను చంద్రబాబు వెనుకబడిన జిల్లాలకు ఖర్చుపెట్టకుండా అనవసర ఖర్చులతో వృద్ధాచేయడం కూడా కేంద్రం ఎక్కువ నిధులు ఇవ్వకపోవడానికి ఒక కారణం అంటున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News