చంద్ర‌బాబు పాపాన్ని క‌డిగేసిన కేసీఆర్‌

రామగుండం ఎరువుల క‌ర్మాగారాన్ని తిరిగి ప్రారంభిస్తాం. చంద్ర‌బాబు చేసిన పాపాన్ని క‌డిగేసుకుంటాం.. ఇది కేసీఆర్ ఉద్య‌మ‌స‌మ‌యంలో ఇచ్చిన హామీ! అనుకున్న‌ట్లే తెలంగాణ రాష్ట్ర క‌ల సాకార‌మైంది. ఈరోజు మూత‌బ‌డ్డ రామ‌గుండం ఎరువుల క‌ర్మాగారం – ఎఫ్‌సీఐ తిరిగి పున‌రుజ్జీవం క‌ల్పించేందుకు ప్ర‌ధానితో తిరిగి శంకుస్థాప‌న చేయిస్తున్నాడు. కేసీఆర్ అన్న‌మాట నిల‌బెట్టుకున్నాడు. చంద్ర‌బాబు చేసిన పాపాన్ని క‌డిగేసుకున్నాడు. ప‌దేళ్లు సీఎంగా అధికారంలో ఉండి చేయ‌లేనిది అధికారంలోకి వ‌చ్చిన రెండో ఏడాదే చేసి చూపించాడు కేసీఆర్‌. ఇక్క‌డే కేసీఆర్ త‌న చ‌తురుత […]

Advertisement
Update: 2016-08-06 21:33 GMT
రామగుండం ఎరువుల క‌ర్మాగారాన్ని తిరిగి ప్రారంభిస్తాం. చంద్ర‌బాబు చేసిన పాపాన్ని క‌డిగేసుకుంటాం.. ఇది కేసీఆర్ ఉద్య‌మ‌స‌మ‌యంలో ఇచ్చిన హామీ! అనుకున్న‌ట్లే తెలంగాణ రాష్ట్ర క‌ల సాకార‌మైంది. ఈరోజు మూత‌బ‌డ్డ రామ‌గుండం ఎరువుల క‌ర్మాగారం – ఎఫ్‌సీఐ తిరిగి పున‌రుజ్జీవం క‌ల్పించేందుకు ప్ర‌ధానితో తిరిగి శంకుస్థాప‌న చేయిస్తున్నాడు. కేసీఆర్ అన్న‌మాట నిల‌బెట్టుకున్నాడు. చంద్ర‌బాబు చేసిన పాపాన్ని క‌డిగేసుకున్నాడు. ప‌దేళ్లు సీఎంగా అధికారంలో ఉండి చేయ‌లేనిది అధికారంలోకి వ‌చ్చిన రెండో ఏడాదే చేసి చూపించాడు కేసీఆర్‌.
ఇక్క‌డే కేసీఆర్ త‌న చ‌తురుత ప్ర‌ద‌ర్శించాడు. వాస్త‌వానికి ఎఫ్‌సీఐ కేంద్రానికి ఆర్థిక భారం కానేకాదు. దాన్ని వాడుకునే విధానం తెలియ‌క ఆర్థిక న‌ష్టాలంటూ మూసివేశారు. రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు, సంవత్సరానికి 10 లక్షల టన్నుల ఎరువుల ఉత్పత్తి సామర్ధ్యానికి కావలసింది కేవలం రూ.5 వేల కోట్ల పెట్టుబడి. దీనిద్వారా సంవత్సరానికి రూ.250 కోట్ల చొప్పున 10- 15 సంవత్సరాలలోనే దాదాపు రూ. 3,750 కోట్ల లాభాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్జించ గలుగుతుంది. ఈ విష‌యాన్ని కేంద్రానికి తెలియ‌జేసి దీన్ని పునః ప్రారంభానికి కేసీఆర్ చేసిన ప్ర‌య‌త్నం విజ‌య‌వంత‌మైంది. ఇక్క‌డే చంద్ర‌బాబుకు కేసీఆర్ కు ఉన్న తేడా తెలిసివ‌చ్చింది.
చంద్ర‌బాబు హ‌యాంలో ప్ర‌యివేటీక‌ర‌ణ పేరుతో వేలాది ప‌రిశ్ర‌మ‌లు మూసివేయించాడు. నిజాం షుగ‌ర్స్‌, ఆస‌ఫ్‌జాహీ మిల్స్ ఇలా చెప్పుకుంటే పోతే ఆ జాబితా చాంతాడంత ఉంటుంది. ప్ర‌పంచ బ్యాంకు ఏజెంటును మ‌రిపించేలా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలతో ల‌క్ష‌లాది మంది కార్మికులు రోడ్డున ప‌డ్డారు. త‌న సొంత డెయిరీ పురోగ‌తి కోసం ప్ర‌భుత్వ‌ డెయిరీ ప‌రిశ్ర‌మ‌ల‌నైతే కుదేల‌య్యేలా చేశాడు. ఆయ‌న వ‌ల్ల మూత‌బ‌డ్డ ప‌రిశ్ర‌మ‌ల్లో ఎఫ్‌సీఐ కూడా ఒక‌టి. ఆర్థిక న‌ష్టాల‌లో కూరుకుపోయి 17 ఏళ్ల క్రితం మూత‌బ‌డింది రామగుండం ఎరువుల క‌ర్మాగారం. సాంకేతిక స‌మ‌స్య‌లు, వ‌రుస న‌ష్టాలు కార‌ణంగా చూపి అప్ప‌టి కేంద్రం ఏప్రిల్ 1, 1999లో రామ‌గుండం ఎఫ్‌సీఐని మూసివేస్తున‌ట్లు ప్ర‌క‌టిచింది. ప‌ర్మినెంట్ కార్మికులంద‌రికీ వీ ఆర్ ఎస్ ఇచ్చి సాగ‌నంపారు. వేలాది మందికి ప్ర‌త్య‌క్షంగా ఉపాధి క‌ల్పించిన ఈ కర్మాగారం మూసివేయాల‌ని కేంద్రం నిర్ణ‌యించినా.. దాన్నిఆపేందుకు ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేయ‌లేదు. పైగా అప్పుడు కేంద్రంలో ఉన్న‌ది బీజేపీ- టీడీపీ మిత్ర‌ప‌క్ష‌మే! అయినా కేంద్రం నిర్ణ‌యాన్ని ఆపేందుకు ఎలాంటి ప్ర‌య‌త్నం చేయ‌లేదు. దీంతో ఒక‌ప్పుడు వేల‌జ‌నాభాతో క‌ళ‌క‌ళ‌లాడిన ఎఫ్‌సీ ఐ బోసిపోయింది. కోతులు, పాములకు నిల‌యంగా మారింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News