సిద్ధారెడ్డి... బాబుపై నమ్మకం లేదు పదవి ఇవ్వండన్నారు

నెల్లూరులో వైఎస్ జగన్‌ యువభేరి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఓటుకు నోటు కేసుకు భయపడే ప్రత్యేక హోదా విషయంలో మోదీని చంద్రబాబు నిలదీయడం లేదని జగన్ ఆరోపించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం హోదాను తాకట్టుపెట్టారని మండిపడ్డారు. రెండేళ్లుగా తమకు ఫీజు రీయింబర్స్‌మెంట్ రావడం లేదని వంశీ అనే విద్యార్థి జగన్‌తో చెప్పారు. మీరు అధికారంలోకి వస్తే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఎలా వైఖరి అవలంభిస్తారని జగన్‌ను విద్యార్థి వంశీ […]

Advertisement
Update: 2016-08-04 04:30 GMT

నెల్లూరులో వైఎస్ జగన్‌ యువభేరి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఓటుకు నోటు కేసుకు భయపడే ప్రత్యేక హోదా విషయంలో మోదీని చంద్రబాబు నిలదీయడం లేదని జగన్ ఆరోపించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం హోదాను తాకట్టుపెట్టారని మండిపడ్డారు. రెండేళ్లుగా తమకు ఫీజు రీయింబర్స్‌మెంట్ రావడం లేదని వంశీ అనే విద్యార్థి జగన్‌తో చెప్పారు. మీరు అధికారంలోకి వస్తే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఎలా వైఖరి అవలంభిస్తారని జగన్‌ను విద్యార్థి వంశీ ప్రశ్నించారు.

ఇందుకు స్పందించిన జగన్… తాము అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడు ఎలాంటి అప్పులు చేయకుండా ఉచితంగా చదువుకునే అవకాశం కల్పిస్తామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ పేర్లు చెబితే వైఎస్ గుర్తుకు వస్తారని జగన్ అన్నారు. అందుకే ఈ రెండు పథకాలను చంద్రబాబు దెబ్బతీస్తున్నారని జగన్ ఆరోపించారు. ఆరోగ్యశ్రీ కోసం రూ. 910కోట్లు చెల్లించాల్సి ఉంటే చంద్రబాబు కేవలం 580 కోట్లు విడుదల చేశారని… ఆ మొత్తంలోనూ రూ. 300 కోట్లు పాత బకాయిల చెల్లింపుకే సరిపోయన్నారు. ఈ సందర్భంగా కదిరి వైసీపీ కో- ఆర్డినేటర్‌ సిద్ధారెడ్డి ఉదంతాన్ని జగన్ ప్రస్తావించి ఆరోగ్యశ్రీ దుస్థితిని వివరించే ప్రయత్నం చేశారు.

”కదిరి వైసీపీ సమన్వయకర్త సిద్దారెడ్డికి ఒక ఆస్పత్రి ఉంది. ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్లు చేస్తుంటారు. కదిరి కో- ఆర్డినేటర్‌గా ఆయన్ను నియమించే సమయంలో నేను అడిగా. మిమ్మల్ని పార్టీ కో-ఆర్డినేటర్‌గా నియమిస్తే మీ ఆస్పత్రికి ఆరోగ్యశ్రీ నిధులు ఇవ్వరేమో ఆలోచించు అన్న… అప్పుడు సిద్దారెడ్డి ఎనిమిది నెలలైంది ఆరోగ్యశ్రీ నిధులు మంజూరు చేయక…. ఇక ఇస్తారన్న నమ్మకం కూడా ఎవరికీ లేదు. చంద్రబాబు ఉన్నంత కాలం ఆరోగ్యశ్రీ నిధులు వస్తాయని మేం అనుకోవడం లేదు. కాబట్టి ఆ భయం లేదు. కో- ఆర్డినేటర్‌గా అవకాశం ఇవ్వండి” అని సిద్ధారెడ్డి అన్నట్టు జగన్‌ చెప్పారు. ఈ ఉదంతం బట్టే ఆరోగ్యశ్రీని చంద్రబాబు ఏ విధంగా నాశనం చేశారో అర్థం చేసుకోవచ్చన్నారు . పేదలు ఆర్థికంగా చితికిపోవడానికి కారణం అధిక ఫీజులు, వైద్యం ఖర్చులేనని ఆ విషయం గమనించే వైఎస్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ ని ప్రవేశపెట్టారని జగన్ చెప్పారు.

నారాయణ కాలేజ్ విద్యార్థి ఒకరు మాట్లాడుతూ తాను యువభేరికి వస్తుంటే తమ కాలేజ్‌ వాళ్లు బెదిరించారని జగన్‌ తో చెప్పారు. ప్రత్యేక హోదా రావడం మంత్రి నారాయణకు ఇష్టం లేదా అని విద్యార్థి అనుమానం వ్యక్తం చేశారు. ఇందుకు స్పందించిన జగన్… ప్రత్యేక హోదా వస్తే చాలా మంది కాలేజీలు, ఇన్‌స్టిట్యూట్లు స్థాపించేందుకు ముందుకు వస్తారని అప్పుడు తనకు పోటీ తీవ్రమవుతుందన్న ఉద్దేశంతోనే నారాయణ ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా పనిచేస్తుండవచ్చని అన్నారు. చంద్రబాబుకు బుద్ధి వచ్చిన రోజే నారాయణకూ బుద్ది వస్తుందన్నారు జగన్.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News