చంద్రబాబుకే సవాల్ చేసిన మూడు కంపెనీలు

సదావర్తి సత్రం భూములను అతితక్కువ ధరకే టీడీపీ నేతలకు కట్టబెట్టిన చంద్రబాబు సర్కార్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. సత్రం భూములను అతితక్కువ ధరకే కట్టబెట్టిన ప్రభుత్వం… తర్వాత ప్రతిపక్షాలకే ఓపెన్ సవాల్ విసిరింది. ఎవరైనా భూమి విలువలో ఒక శాతం ఎక్కువగా చెల్లించినా లేదంటే అదనంగా మరో రూ. 5కోట్లు చెల్లించేందుకు సిద్ధపడితే భూములను బదిలీ చేస్తామని ప్రకటించింది. చంద్రబాబు కూడా బుధవారం అదే మాట చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్టుగానే ఐదు కోట్లు చెల్లించేందుకు మూడు […]

Advertisement
Update: 2016-07-20 23:19 GMT

సదావర్తి సత్రం భూములను అతితక్కువ ధరకే టీడీపీ నేతలకు కట్టబెట్టిన చంద్రబాబు సర్కార్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. సత్రం భూములను అతితక్కువ ధరకే కట్టబెట్టిన ప్రభుత్వం… తర్వాత ప్రతిపక్షాలకే ఓపెన్ సవాల్ విసిరింది. ఎవరైనా భూమి విలువలో ఒక శాతం ఎక్కువగా చెల్లించినా లేదంటే అదనంగా మరో రూ. 5కోట్లు చెల్లించేందుకు సిద్ధపడితే భూములను బదిలీ చేస్తామని ప్రకటించింది. చంద్రబాబు కూడా బుధవారం అదే మాట చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్టుగానే ఐదు కోట్లు చెల్లించేందుకు మూడు కంపెనీలు ముందుకొచ్చాయి.

హైదరాబాద్‌కు చెందిన మూడు కంపెనీలు తాము అదనంగా రూ. 5 కోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని భూములు తమకివ్వాలంటూ ప్రభుత్వానికి లేఖ రాశాయి. అయితే ఈ లేఖ అంశాన్ని బయటకు రాకుండా చంద్రబాబు ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఈ లేఖను ఒక ప్రముఖ పత్రిక ప్రచురించింది. అయితే చంద్రబాబు కంపెనీల ఆఫర్‌కు స్పందిస్తారా అన్నది చర్చనీయాంశమైంది. వెయ్యి కోట్ల విలువైన భూమిని తమ పార్టీ నేతలకు కేవలం 22 కోట్లకే అప్పగించిన చంద్రబాబు ఇప్పుడా భూములను మరొకరికి ఇచ్చేందుకు అంగీకరిస్తారా అన్న దానిపై అనుమానమే. తన అధికారబలంతో ప్రతి ఒక్కరిని లొంగదీసుకుంటున్న చంద్రబాబు… ఇప్పుడు ఆ మూడు కంపెనీలను వదిలిపెడుతారా?. ఒకవేళ చంద్రబాబు తమ మాట మీద నిలబడి ఐదు కోట్లు అదనంగా ఇచ్చే కంపెనీలకే సదావర్తి భూములు అప్పగిస్తే మాత్రం ఆయనలో ఇంకా నిజాయితీ ఉందని భావించాల్సిందే. అయితే ఈమూడు కంపెనీలు ఏవన్నది కథనాన్ని రాసిన పత్రిక వెల్లడించలేదు. లేఖను మాత్రమే ప్రచురించింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News