సాక్షి పత్రిక స్పందన ఆశ్చర్యమే!

ఏపీలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ సాక్షి టీవీ ప్రసారాలను ప్రభుత్వం నిలిపివేయించింది. ముద్రగడ దీక్ష కారణం చూపి ఎంఎస్‌ఓలపై ఒత్తిడి తెచ్చి సాక్షిని కట్ చేయించింది. కేవలం డీటీహెచ్‌ల్లో మాత్రమే సాక్షి ప్రసారాలు అందుతున్నాయి. సాక్షిటీవీ ప్రసారాల నిలిపివేతపై మరుసటి రోజు సాక్షి పత్రిక తీవ్రంగా స్పందిస్తుందని చాలా మంది భావించారు. కానీ ఈ అంశంపై సాక్షి పత్రిక స్పందన కాసింత ఆశ్చర్యంగానే ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేసినా దాని మీద ప్రత్యేకంగా చిన్న కథనం […]

Advertisement
Update: 2016-06-10 02:04 GMT

ఏపీలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ సాక్షి టీవీ ప్రసారాలను ప్రభుత్వం నిలిపివేయించింది. ముద్రగడ దీక్ష కారణం చూపి ఎంఎస్‌ఓలపై ఒత్తిడి తెచ్చి సాక్షిని కట్ చేయించింది. కేవలం డీటీహెచ్‌ల్లో మాత్రమే సాక్షి ప్రసారాలు అందుతున్నాయి. సాక్షిటీవీ ప్రసారాల నిలిపివేతపై మరుసటి రోజు సాక్షి పత్రిక తీవ్రంగా స్పందిస్తుందని చాలా మంది భావించారు. కానీ ఈ అంశంపై సాక్షి పత్రిక స్పందన కాసింత ఆశ్చర్యంగానే ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేసినా దాని మీద ప్రత్యేకంగా చిన్న కథనం కూడా సాక్షి పత్రిక రాయలేదు.

ముద్రగడ అరెస్ట్ అంశాన్నే బ్యానర్‌గా పెట్టి అదే కథనంలో సాక్షి ప్రసారాలు నిలిపివేశారంటూ ఒకలైన్‌ రాసి సరిపెట్టారు. పైగా సాక్షినే కాకుండా మిగిలిన టీవీ చానళ్లపైనా ముద్రగడ కథనాలను ప్రసారం చేయకుండా ఆంక్షలు పెట్టారంటూ రాశారు. సొంత చానల్ ప్రసారాలనే నిలిపివేసినప్పటికీ పత్రిక ఎక్కడా ఖండించలేదు. జర్నలిస్టు సంఘాల ఖండనను కూడా లోపలి పేజీల్లో వేసిసరిపెట్టారు. ఇలా చేయడం వెనుక సాక్షి పత్రిక వ్యూహం ఏంటో గానీ… సాక్షి టీవీని ఒక రోజుకాదు ఈ మూడేళ్లు నిలిపివేసినా పెద్దగా ప్రతిఘటన ఉండదు అన్న అభిప్రాయాన్ని సాక్షి పత్రిక బాగానే పంపింది.

ఈ విషయంలోనే కాకుండా ఇటీవల కొన్ని విషయాల్లో సాక్షి ప్రతిక స్పందన ఆశ్చర్యంగానే ఉంటోంది. చంద్రబాబును గట్టెక్కించే కథనాలు కూడా ఇటీవల సాక్షి పత్రికలో అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి.ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంతో సాక్షి టీవీ మాత్రం చాలా దూకుడుగా పనిచేస్తున్నది. ఆ మధ్య వెలగపూడిలో జపాన్ బృందం ఐదు నిమిషాల్లోనే పర్యటన ముగించుకుని వెళ్లింది. టీడీపీయేతర ప్రతికలన్నీ అదే విషయాన్ని రాశాయి. సాక్షి టీవీ కూడా రోజంతా అదే విషయం చెప్పింది. తెల్లవారాక సాక్షి పత్రిక చూస్తే వెలగపూడిలో జపాన్ బృందం 40 నిమిషాలపాటు పర్యటించిందని సెలవిచ్చింది. కొంపదీసి సాక్షిలో కొందరు బాబు కోసం పనిచేస్తున్నారా అన్న అనుమానం కూడా కలిగేలా కథనాలు ఉంటున్నాయి.

రాజధాని దురాక్రమణపై ఆ మధ్య సాక్షి వరుసపెట్టి కథనాలు రాసి ప్రకంపనలు సృష్టించింది. కానీ ఆ కథనాలు వేయడానికి ముందు సమస్యలొస్తాయంటూ కొందరు పత్రిక పెద్దలు అడ్డుపుల్ల వేసేందుకుకూడా ప్రయత్నించారని చెబుతుంటారు. కానీ చివరకు జగన్‌ ఆదేశంలోనే ఆ కథనాలు అచ్చయ్యాయని అంటుంటారు. మొత్తానికి ఏపీలో సాక్షి టీవీకి బాబు ప్రభుత్వం ముసుగేసేసినా సాక్షిపత్రిక మాత్రం నామమాత్రపు స్పందనతో సరిపెట్టింది. తెలంగాణలో చంద్రబాబు అనుకూల టీవీ చానల్‌పై ఈ తరహా బ్యాన్ విధించినప్పుడు సదరు చానల్‌కే చెందిన పత్రిక ఓ రేంజ్‌లో పోరాడింది. ఆ స్పూర్తి ఇప్పుడు సాక్షికి ఎందుకులేదో!. బహుశా దీని వెనుక ఏదైనా వ్యూహం ఉందేమో!.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News