ఇద్ద‌రూ ఇద్ద‌రే..!

తెలంగాణ పోరు ముగిసింది. ఇంకా జేఏసీ అవ‌స‌రం ఏంటి? ఇది తెరాస నాయ‌కులు జేఏసీకి వేస్తోన్న ప్ర‌శ్న‌. తెలంగాణ రాష్ట్ర స‌మితి ఉద్య‌మ‌పార్టీగా కొన‌సాగింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం త‌రువాత ఎందుకు కొన‌సాగాలి? ఇప్పుడు ప‌లువురు ప్ర‌తిప‌క్ష నాయ‌కులు కేసీఆర్ కు సంధిస్తోన్న ప్ర‌శ్న‌. రెండు ప్ర‌శ్న‌లు స‌హేతుక‌మైన‌వే. మ‌రి ఈ రెండు ప్ర‌శ్న‌ల‌కు ఎవ‌రు స‌మాధానం చెప్పాలి? మీ ఊహ క‌ర‌క్టే.. ఈ రెండు ప్ర‌శ్న‌ల‌కు వాటి అధినేత‌లే జ‌వాబివ్వాలి. అయితే.. ఈ ప్ర‌శ్న ఉద‌యిస్తుంద‌న్న […]

Advertisement
Update: 2016-06-09 01:29 GMT

తెలంగాణ పోరు ముగిసింది. ఇంకా జేఏసీ అవ‌స‌రం ఏంటి? ఇది తెరాస నాయ‌కులు జేఏసీకి వేస్తోన్న ప్ర‌శ్న‌. తెలంగాణ రాష్ట్ర స‌మితి ఉద్య‌మ‌పార్టీగా కొన‌సాగింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం త‌రువాత ఎందుకు కొన‌సాగాలి? ఇప్పుడు ప‌లువురు ప్ర‌తిప‌క్ష నాయ‌కులు కేసీఆర్ కు సంధిస్తోన్న ప్ర‌శ్న‌. రెండు ప్ర‌శ్న‌లు స‌హేతుక‌మైన‌వే. మ‌రి ఈ రెండు ప్ర‌శ్న‌ల‌కు ఎవ‌రు స‌మాధానం చెప్పాలి? మీ ఊహ క‌ర‌క్టే.. ఈ రెండు ప్ర‌శ్న‌ల‌కు వాటి అధినేత‌లే జ‌వాబివ్వాలి. అయితే.. ఈ ప్ర‌శ్న ఉద‌యిస్తుంద‌న్న సంగ‌తి వారికి ముందే తెలుసు. అందుకే, తెలంగాణ ఆవిర్భావం జ‌రిగాక‌.. వారు ఈ ప్ర‌శ్న‌కు అప్పుడే స‌మాధానాలు చెప్పేశారు. అందుకే, ఇద్ద‌రూ ఇద్ద‌రే.. అనిపించుకుంటున్నారు.. వాటిని ఒక‌సారి గుర్తు చేసుకుందాం!

తెరాస ఇక నుంచి రాజ‌కీయ పార్టీ..!
14 ఏళ్ల ప్ర‌త్యేక రాష్ట్ర పోరు ముగిసింది. తెలంగాణ క‌ల సాకార‌మైంది. ఇప్ప‌టిదాకా ఉద్య‌మ‌పార్టీగా పేరొందిన‌ తెలంగాణ రాష్ట్ర స‌మితి ఇక నుంచి సంపూర్ణ రాజ‌కీయ పార్టీగా రూపాంతరం చెంద‌నుంది. రాజ‌కీయ పార్టీగానే ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్నాం. పోరాడి తెలంగాణ సాధ‌న క‌ల నెర‌వేర్చిన మాకే ప‌ట్టం క‌ట్టండి అని కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. త‌రువాత ఉద్య‌మ‌పార్టీ రాజ‌కీయ పార్టీగా మారిందని, ఇక బంగారు తెలంగాణ క‌ల సాకార‌మ‌య్యేలా కృషి చేస్తుంద‌ని ప్ర‌క‌టించారు.

స‌మ‌స్య‌ల సాధ‌న‌కు జేఏసీ కూడా కొన‌సాగుతుంది
తెలంగాణ ఆవిర్భావం తరువాత జేఏసీ ఉంటుందా? ఉండ‌దా? అన్న ప్ర‌శ్న చాలామందిలో ఉద‌యించింది. ఆ అనుమానాల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ.. కోదండ‌రామ్ ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణ సాధ‌న‌లో ముందున్నాం. అలాగే, ఇక‌పై తెలంగాణ ప్ర‌జ‌ల‌ అభివృద్ధికి, స‌మ‌న్యాయం చేర‌వేయ‌డంలోనూ ముందే ఉంటాం. పోరాటాల‌నే న‌మ్ముకున్నాం.. కాబ‌ట్టి తెలంగాణ క‌ల సాకారంతోనే.. మా ప‌ని ముగియ‌లేదు. మునుముందు మా ముందు అనేక స‌వాళ్లు ఉన్నాయి. వాటిని ప‌రిష్క‌రించాల్సిన బాధ్య‌త మాపై ఉంది అని ప్ర‌క‌టించారు. దాంతో జేఏసీ ఉనికిలో ఉంటుంద‌ని, ఉద్యోగులు, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాటం సాగిస్తుంద‌న్న భ‌రోసా అనాడే ఇచ్చారు కోదండ‌రాం.

Tags:    
Advertisement

Similar News