అన్ని తిట్లు తిట్టి ఆ పార్టీలోకి డీఎల్ ఎలా వెళ్తారో!

మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని వార్తలొస్తున్నాయి. దీనిపై ఇప్పటికే నారా లోకేష్‌ను కలిసి రవీంద్రారెడ్డి తన మనసులో మాట చెప్పారంటున్నారు. లోకేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినా డీఎల్‌ రాకను మైదుకూరు టీడీపీ ఇన్‌చార్జ్ సుధాకర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. తన బంధువైన యనమల ద్వారా డీఎల్ ప్రయత్నాలను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని చెబుతున్నారు.. అయితే డీఎల్ టీడీపీలోకి వెళ్తే ఆయన వ్యక్తిత్వాన్ని కూడా అనుమానించాల్సి ఉంటుందని జిల్లా నేతలు చెబుతున్నారు. ఎందుకంటే కొన్ని నెలల […]

Advertisement
Update: 2016-06-04 03:48 GMT

మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని వార్తలొస్తున్నాయి. దీనిపై ఇప్పటికే నారా లోకేష్‌ను కలిసి రవీంద్రారెడ్డి తన మనసులో మాట చెప్పారంటున్నారు. లోకేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినా డీఎల్‌ రాకను మైదుకూరు టీడీపీ ఇన్‌చార్జ్ సుధాకర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. తన బంధువైన యనమల ద్వారా డీఎల్ ప్రయత్నాలను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని చెబుతున్నారు.. అయితే డీఎల్ టీడీపీలోకి వెళ్తే ఆయన వ్యక్తిత్వాన్ని కూడా అనుమానించాల్సి ఉంటుందని జిల్లా నేతలు చెబుతున్నారు.

ఎందుకంటే కొన్ని నెలల క్రితమే చంద్రబాబు ప్రభుత్వంపై డీఎల్ తీవ్ర విమర్శలు చేశారు. రాయలసీమకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేస్తున్నారని… అభివృద్ధి మొత్తం తీసుకెళ్లి కృష్ణా,గుంటూరు జిల్లాల్లో కేంద్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికీ రాయలసీమ జనం మేలుకోకపోతే సీమను సర్వనాశనం చేసే వరకు చంద్రబాబు నిద్రపోరని కొన్ని నెలల క్రితం డీఎల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాంటి డీఎల్ ఇప్పుడు హఠాత్తుగా టీడీపీలో చేరి చంద్రబాబుకు ఎలా జై కొడుతారని ప్రశ్నిస్తున్నారు. పైగా డీఎల్‌ మీద మరోముద్ర కూడా ఉంది.

సొంత పార్టీకే చెందిన ముఖ్యమంత్రులు తప్పు చేసినా ఆయన తగువు పెట్టుకుంటారని చెబుతున్నారు. వైఎస్‌తోనూ అలాగే వ్యవహరించారు. కిరణ్‌కుమార్ రెడ్డితో వివాదం చాలా దూరం వెళ్లి చివరకు మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు డీఎల్ రవీంద్రారెడ్డి గురయ్యారు. అలా దేనినైనా ముక్కుసూటిగా మాట్లాడుతారని పేరున్న, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన, చంద్రబాబు కంటే సీనియర్ నేత అయిన డీఎల్ ఇప్పుడు కష్టపడి లోకేష్‌ను కలిసి రాజకీయ భవిష్యత్తుపై చర్చించడం విచిత్రమే.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News