పిన్నెల్లి కోసం లుక్‌ అవుట్‌ నోటీసులు.. ఏ క్షణమైనా అరెస్టు!

పాల్వాయి పోలింగ్‌ బూత్‌లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన విజువల్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ ఘటనపై ఈసీ సీరియస్ అయింది.

Advertisement
Update: 2024-05-22 11:41 GMT

ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం ఏపీ పోలీసులు లుక్‌ అవుట్ నోటీసులు జారీ చేశారు. పిన్నెల్లి విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారంతో ఈ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే అన్ని ఎయిర్‌పోర్టులను పోలీసులు అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు పిన్నెల్లిపై దాదాపు 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. IPC సెక్షన్ 143, 147, 448, 427, 353, 453, 452, 120B, RP యాక్ట్ 131, 135 కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోర్టులో A1 మెమో కూడా దాఖలు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా పిన్నెల్లి కోసం గాలింపును ముమ్మరం చేశారు పోలీసులు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కంది దగ్గర పిన్నెల్లి కారును గుర్తించిన పోలీసులు.. ఆయన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

పాల్వాయి పోలింగ్‌ బూత్‌లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన విజువల్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ ఘటనపై ఈసీ సీరియస్ అయింది. తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు పిన్నెల్లి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు.

టీడీపీ నేతలు రిగ్గింగ్ చేయడంతోనే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశారని వైసీపీ నేతలు చెప్తున్నారు. పోలింగ్ బూత్‌లోకి వైసీపీ మద్దతుదారులు అడుగుపెట్టకుండా అడ్డుకుని వారిపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారని ఆరోపిస్తున్నారు. పాల్వాయిలో వైసీపీ నేతలపై టీడీపీ నేతల దాడులకు సంబంధించిన వీడియోలను సాక్ష్యాలుగా చూపిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News