మాచర్లలో టీడీపీ రిగ్గింగ్.. కాసు మహేష్ రెడ్డి సంచలనం

మాచర్లలో అల్లర్లకు టీడీపీ కారణం కాదా అని ప్రశ్నించారు కాసు మ‌హేష్‌రెడ్డి. బీసీలు, ఎస్టీలు వైసీపీకి ఓటేశారన్న కారణంతోనే దాడులు జరిగాయన్నారు.

Advertisement
Update: 2024-05-22 14:42 GMT

మాచర్లలో రిగ్గింగ్ జరిగిందంటూ సంచలన ఆరోపణలు చేశారు గురజాల ఎమ్మెల్యే, వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి తప్పు చేశారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మొత్తం వీడియో బయటపెడితేనే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. ఇన్ని రోజుల తర్వాత ఒక్క వీడియో మాత్రమే ఎందుకు రిలీజ్ చేశారని అనుమానాలు లేవనెత్తారు కాసు. రిగ్గింగ్ జరిగిందని చెప్తుంటే పూర్తి వీడియో ఎందుకు రిలీజ్ చేయడం లేదని ప్రశ్నించారు.


మాచర్లలో ఎవరు దాడి చేశారో ప్రజలందరికీ తెలియాలన్నారు కాసు మ‌హేష్‌రెడ్డి. తెలుగుదేశం పార్టీ వాళ్లు రిగ్గింగ్ చేశారు కాబట్టే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేశారన్నారు. మాచర్లలో పిన్నెల్లి గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. ఈ అంశంపై ఎక్కడివరకైనా పోరాటం చేస్తామన్నారు.

మాచర్లలో అల్లర్లకు టీడీపీ కారణం కాదా అని ప్రశ్నించారు కాసు మ‌హేష్‌రెడ్డి. బీసీలు, ఎస్టీలు వైసీపీకి ఓటేశారన్న కారణంతోనే దాడులు జరిగాయన్నారు. అందరికీ శిక్ష పడే వరకు పోరాడతామన్నారు. ఆ రోజు ఏం జరిగిందనేదానిపై పూర్తి వీడియోను ఎన్నికల అధికారులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News