వైట్ కాలర్ వర్కర్ కావాలా..? బ్లాక్ మెయిలర్ కావాలా..?

తీన్మార్ మల్లన్న చీటర్ అనే విషయం ఆయన ఎన్నికల అఫిడవిట్ చూస్తేనే అర్థమవుతుందన్నారు కేటీఆర్. 56 కేసులు ఆయనపై ఉన్నాయని, 74 రోజుల జైలు జీవితం గడిపారని చెప్పారు.

Advertisement
Update: 2024-05-22 14:51 GMT

తెలంగాణలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎవరు మంచివారు, ఎవర్ని చట్టసభలకు పంపిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది.. అనే విషయంలో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. బీఆర్ఎస్ తరపున బరిలో దిగుతున్న రాకేష్ రెడ్డి.. రైతు బిడ్డ, విద్యావంతుడు, బిట్స్ పిలానీలో గోల్డ్ మెడలిస్ట్ అని వివరించారు. అటు వైపు ఉన్న తీన్మార్ మల్లన్న ఒక బ్లాక్ మెయిలర్, చీటర్, మన మెడలో గోల్డ్ గుంజుకుపోయే దొంగ అని ఎద్దేవా చేశారు కేటీఆర్.


తీన్మార్ మల్లన్న చీటర్ అనే విషయం ఆయన ఎన్నికల అఫిడవిట్ చూస్తేనే అర్థమవుతుందన్నారు కేటీఆర్. 56 కేసులు ఆయనపై ఉన్నాయని, 74 రోజుల జైలు జీవితం గడిపారని చెప్పారు. ఆయనపై ఉన్న కేసుల్ని కూడా వివరించారు. అమ్మాయిల ఫొటోల్ని మార్ఫింగ్ చేసిన కేసులున్నాయని, బ్లాక్ మెయిల్ చేసి కుటుంబాల పరువు తీసిన కేసులున్నాయని, చీటింగ్ కేసులున్నాయని వివరించారు. అలాంటి వ్యక్తిని చట్టసభలకు పంపిస్తే ఆ సభలు బూతులకు వేదిక అవుతాయని అన్నారు కేటీఆర్.

కాంగ్రెస్ పార్టీపై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలయ్యాయని అన్నారు. రుణమాఫీ కాలేదని, రైతులకు బోనస్ దక్కలేదని, రాష్ట్రంలో మోసాల పరంపర సాగుతోందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు కావాలంటే... పట్టభద్రుల ఎమ్మెల్సీగా రాకేష్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు కేటీఆర్.

Tags:    
Advertisement

Similar News