పిన్నెల్లి వీడియో ఫేక్‌.. టీడీపీతో ఈసీ కుమ్మక్కు - అంబటి

పిన్నెల్లి వీడియో ఒరిజినలా.. ఫేక్ వీడియోనా అనేది తేల్చాలన్నారు అంబటి. అదే బూత్‌లో వైసీపీ సానుభూతిపరులు ఓటేస్తే ఒప్పుకోని పరిస్థితి ఉందన్నారు.

Advertisement
Update: 2024-05-22 16:59 GMT

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన‌ట్లు వైరల్‌ అవుతున్న వీడియో ఫేక్ అన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఎన్నికల కమిషన్ నియంత్రణలో ఉండాల్సిన వీడియో లోకేష్‌ ట్విట్టర్‌లోకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. పిన్నెల్లి నిజంగానే తప్పు చేస్తే చట్టం చూసుకుంటుందన్నారు. ఈసీ వీడియో రిలీజ్ చేయకుండా.. లోకేష్‌కు వీడియో ఎలా వచ్చిందన్నారు. లోకేష్‌ రిలీజ్ చేసిన వీడియోపై ఈసీ చర్యలు తీసుకోవడమేంటన్నారు.

పిన్నెల్లి వీడియో ఒరిజినలా.. ఫేక్ వీడియోనా అనేది తేల్చాలన్నారు అంబటి. అదే బూత్‌లో వైసీపీ సానుభూతిపరులు ఓటేస్తే ఒప్పుకోని పరిస్థితి ఉందన్నారు. పోలింగ్ బూత్‌ బయటే వైసీపీ మద్దతుదారులను టీడీపీ కార్యకర్తలు హింసించి తరిమేశారని ఆరోపించారు. ఇదే అంశంపై పిన్నెల్లి ఫిర్యాదు చేశారని, కానీ ఏ ఒక్కరూ ఆయన విజ్ఞప్తిని పట్టించుకోలేదన్నారు అంబటి. వైసీపీ కార్యకర్తలపై దాడులు జరిగినా పోలీసులు పట్టించుకోలేదన్నారు.


చాలా నియోజకవర్గాల్లో బూత్ క్యాప్చరింగ్ జరిగిందన్నారు అంబటి. తన సొంత నియోజకవర్గం సత్తెనపల్లిలోనూ బూత్ క్యాప్చరింగ్ చేసి తెలుగుదేశం వాళ్లు ఓట్లేసుకున్నారని ఆరోపించారు. వెబ్ క్యామ్‌ ఓపెన్ చేయాలని డిమాండ్ చేసినా ఓపెన్ చేయట్లేదన్నారు.

Tags:    
Advertisement

Similar News