ప్రియుడి కోసం తండ్రి ప్రాణాలు తీసి, ఇతర కుటుంబ సభ్యులకు కూడా..

ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్ జిల్లాలో సోమవారం రాత్రి ఈ దారుణం జరిగింది. 17 ఏళ్ల అమ్మాయి తన ప్రేమికుడి సలహాతో ప్రేమకు అడ్డు వచ్చిన తన కుటుంబాన్ని మొత్తం చంపాలని ప్లాన్ చేసింది.

Advertisement
Update: 2024-05-22 16:06 GMT

ప్రియుడి కోసం ఒక మైనర్ బాలిక దారుణానికి ఒడికట్టింది. ప్రియుడిని కలవనివ్వటం లేదన్న కోపంతో మొత్తం కుటుంబ సభ్యులందరికీ భోజనంలో నిద్ర మాత్రలు కలిపి పెట్టింది. తండ్రిని చంపి , సోదరుడిని సుత్తితో కొట్టి హత్య చేయాలని చూసింది. అయితే దెబ్బల నొప్పికి మేల్కొన్న ఆమె అన్న అరుపులకు చుట్టుపక్కల ఇళ్ళనుంచి జనం బయటకు రావడంతో పారిపోవడానికి ప్రయత్నించి చివరికి దొరికి పోయి కటకటాలపాలయ్యింది. సంఘటన వివరాల్లోకి వెళితే .

ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్ జిల్లాలో సోమవారం రాత్రి ఈ దారుణం జరిగింది. 17 ఏళ్ల అమ్మాయి తన ప్రేమికుడి సలహాతో ప్రేమకు అడ్డు వచ్చిన తన కుటుంబాన్ని మొత్తం చంపాలని ప్లాన్ చేసింది. సోమవారం రాత్రి నిద్ర మాత్రలు కలిపిన భోజనాన్ని పెంపుడు కుక్కతో సహా అందరూ తినేలా చేసింది. దీంతో కుటుంబసభ్యులు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. సమయం చూసుకొని ప్రేమికుడిని ఇంటికి ఆహ్వానించింది.

అతని సాయంతో ఆ యువతి పదునైన బ్లేడుతో తండ్రి గొంతు కోసింది. తరువాత సోదరుడిపై సుత్తితో దాడి చేసింది. అయితే ఆమె సోదరుడు దెబ్బలకు తాళలేక మేల్కొని అరుపులు మొదలుపెట్టాడు. దీంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని యువతిని, ప్రియుడిని పోలీసులకు అప్పగించారు.

తండ్రిని, సోదరుడిని ఆసుపత్రికి తరలించగా తండ్రి అప్పటికే మరణించాడు. అయితే చేసిన తప్పును మొదట అంగీకరించని యువతి పోలీసులు తమ పద్ధతిలో విచారించగా హత్య చేసినట్లు అంగీకరించింది.

బాలిక తండ్రి 50 ఏళ్ల అజయ్ పాల్ రాజ్‌పుత్ గ్రామాభివృద్ధి అధికారి (కార్యదర్శి)గా పనిచేస్తున్నారు. తన ప్రేమను తండ్రి , అన్నయ్య అంగీకరించలేదని, విషయాన్ని తన ప్రేమికుడికి తెలుపగా మన ప్రేమను అంగీకరించలేని వాళ్ళను ఈ లోకంలో ఉండానివ్వద్దు అని చెప్పాడని, అందుకే ఈ హత్యలకు ప్లాన్ చేశామని తెలిపింది. హత్య చేసినప్పుడు అరవకుండా ఉండటంకోసం కుక్కకు కూడా నిద్ర మాత్రలు ఇచ్చినట్టు ఒప్పుకుంది. గాయపడిన సోదరుడు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఈ కేసులో ఇద్దరు నిందితుల విచారణ కొనసాగుతోంది.

Tags:    
Advertisement

Similar News