జగన్ యాత్రలో ఉద్రిక్తత... నాటకం రక్తికట్టించిన జేసీ

పదేపదే ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబునాయుడిని ప్రజలు చెప్పుతో కొట్టాలన్న జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో జగన్ రైతు భరోసా యాత్ర సాగుతున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా టీడీపీ నేతల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వెంటనే జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం జగన్ యాడికిలో వైసీపీ నేత ఇంట్లో ఉండగానే టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. జగన్ పర్యటనను అడ్డుకుంటామంటూ ఆందోళన చేశారు. ఇదే సమయంలో […]

Advertisement
Update: 2016-06-03 01:03 GMT

పదేపదే ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబునాయుడిని ప్రజలు చెప్పుతో కొట్టాలన్న జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో జగన్ రైతు భరోసా యాత్ర సాగుతున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా టీడీపీ నేతల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వెంటనే జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం జగన్ యాడికిలో వైసీపీ నేత ఇంట్లో ఉండగానే టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. జగన్ పర్యటనను అడ్డుకుంటామంటూ ఆందోళన చేశారు.

ఇదే సమయంలో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ మరింత దూకుడు ప్రదర్శించారు. ఏకంగా జగన్‌ను యాడికిలోనే అడ్డుకుంటానంటూ బయలుదేరి కథ రక్తికట్టించారు. దీంతో జేసీని చుక్కులూరువద్ద పోలీసులు అడ్డుకున్నారు. యాడికిలో 144 సెక్షన్ విధించారు. ధర్మవరంలోనూ టీడీపీఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీడీపీకార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. మొత్తం ఎపిసోడ్‌లో జేసీ ప్రభాకర్‌ రెడ్డి చాలా దూకుడుగా వ్యవహరించారు. చంద్రబాబును చెప్పుతోకొట్టాలన్న జగన్ విమర్శలపై స్పందించిన ప్రభాకర్ రెడ్డి తాను తలుచుకుంటే తాడిపత్రిలోనే పది నిమిషాల్లో జగన్‌ను కొట్టిస్తా అని హెచ్చరించారు. ఆయన కూడా జగన్‌కు చెప్పు దెబ్బలు దగ్గర పడ్డాయని ఆరోపించారు. ఈ మధ్య జేసీ సోదరులు చంద్రబాబు మీద ఈగ వాలనివ్వడం లేదు. ఈ మధ్య జేసీ దివాకర్ రెడ్డి… తమ రెడ్లంతా చంద్రబాబు వెంటే ఉంటామని ప్రకటించి బాబు దగ్గర మార్కులుకొట్టేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు జగన్ వ్యాఖ్యలతో కలిసొచ్చిన అవకాశాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా బాగానే వాడుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News