మహానాడు ఎలా ఉందో ఈ మైకే ఉదాహరణ- సర్వే లెక్కలతో బాబు రుసరుస

మహానాడు నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమనిర్వాహణపై కార్యకర్తల నుంచి అభిప్రాయలు సేకరించి సర్వే చేయించామని ఏమాత్రం పనితీరు బాగోలేదని వెల్లడించారు. గణాంకాలను వేదికపైనే చదివారు. చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం..గతేడాది…ఈఏడాది పోలిస్తే  …………………………………………….గతేడాది మహానాడు                    తాజా మహానాడు అల్పాహారం (బాగుంది అన్నవారు)             75. 88 శాతం       […]

Advertisement
Update: 2016-05-28 03:46 GMT

మహానాడు నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమనిర్వాహణపై కార్యకర్తల నుంచి అభిప్రాయలు సేకరించి సర్వే చేయించామని ఏమాత్రం పనితీరు బాగోలేదని వెల్లడించారు. గణాంకాలను వేదికపైనే చదివారు. చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం..గతేడాది…ఈఏడాది పోలిస్తే

…………………………………………….గతేడాది మహానాడు తాజా మహానాడు
అల్పాహారం (బాగుంది అన్నవారు) 75. 88 శాతం 65. 54 శాతం
మధ్యాన్న భోజనం 77.4 67.9
మరుగుదొడ్ల శుభ్రత 74 59
ప్రాంగణంలో ఏర్పాట్లు 80.39 79.3
సాంస్కృతిక కార్యక్రమాలు 75 67
రవాణా వ్యవస్థ 76 70
వసతి ఏర్పాట్లు 79 63
రక్తదాన శిబిరం 83 74
ఫోటో ఎగ్జిబిషన్ 86 79
సభా అలంకరణ 89 74
వాలంటీర్ ల పనితీరు(బాగుంది అన్నవారు) 68శాతం 69 శాతం

గతేడాదితో పోలిస్తే ఒక్క వాలంటీర్ల పనితీరు మినహా మిగిలిన అన్ని విభాగాల్లోనూ నిర్వాహణ వెనుకబడిందని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఈగణాంకాలు ప్రకటిస్తున్న సమయంలోనే మైక్ మూగబోయింది. దీంతో కొంచెం ఘాటుగానే చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. మహానాడు నిర్వాహణ ఎలా ఉందో చెప్పడానికి ఈ మైక్ పనితీరే నిదర్శనం అని అసంతృప్తి వ్యక్తబరిచారు. ఇన్నేళ్లుగా మహానాడు నిర్వహిస్తున్నప్పటికీ పనితీరు ఎందుకు మెరుగుపడడం లేదనిప్రశ్నించారు. తాను పనిచేసే వారినేగుర్తిస్తానని ఐదారుసార్లు కనిపించినంత మాత్రాన మెచ్చుకునే వాడిని కాదన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News