కామినేని క్రీడలపై "షా"కు ఫిర్యాదుల వెల్లువ

యుద్ధం చేసేందుకు సిద్ధమైన వెయ్యి మంది సైన్యాన్ని… ”అబ్బే మన వల్ల కాదు” అంటూ నిరాశపరిచేందుకు ఒక్కరు చాలు. ఇప్పుడు ఏపీ బీజేపీలోనూ ఇదే పరిస్థితి తయారైందని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు.  సొంతంగా ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే…  కామినేని లాంటి వారు  నీళ్లు చల్లుతున్నారని రుసరుసలాడుతున్నారు. కామినేని బీజేపీ మంత్రా లేక టీడీపీ మంత్రా అన్నది అర్థం కాక తలపట్టుకుంటున్నారు. తాజాగా ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయంలో కామినేని వ్యవహరించిన తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం […]

Advertisement
Update: 2016-04-24 08:28 GMT

యుద్ధం చేసేందుకు సిద్ధమైన వెయ్యి మంది సైన్యాన్ని… ”అబ్బే మన వల్ల కాదు” అంటూ నిరాశపరిచేందుకు ఒక్కరు చాలు. ఇప్పుడు ఏపీ బీజేపీలోనూ ఇదే పరిస్థితి తయారైందని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. సొంతంగా ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే… కామినేని లాంటి వారు నీళ్లు చల్లుతున్నారని రుసరుసలాడుతున్నారు. కామినేని బీజేపీ మంత్రా లేక టీడీపీ మంత్రా అన్నది అర్థం కాక తలపట్టుకుంటున్నారు. తాజాగా ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయంలో కామినేని వ్యవహరించిన తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కామినేని బీజేపీ లీడరా లేక టీడీపీలోకి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చే బ్రోకరా అని ప్రశ్నిస్తున్నారు. కదిరి వైసీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా టీడీపీలో చేరడం వెనుక కామినేని చక్రం తిప్పడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాంద్‌ బాషాను రప్పించడంతో పాటు అతడి రాకపై అసమ్మతి వ్యక్తం చేసిన జిల్లా టీడీపీ నేతలను బుజ్జగించే చర్యల్లో కామినేని భాగస్వామికావడంపై కమలనాథులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలు ఫిరాయించడం వ్యభిచారంతో సమానమని బీజేఎల్సీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు చెప్పారు. అదే రోజు కామినేని వైసీపీ ఎమ్మెల్యే చాంద్ బాషాను గోడ దూకించే చర్యల్లో పాల్గొనడం బట్టి కామినేని కంప్లీట్‌గా పచ్చ చొక్క వేసుకుని తిరుగుతున్నారని బీజేపీ నేతలు నిర్థారణకు వచ్చారు.

కామినేనిపై జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఒక వర్గం నేతలు ఫిర్యాదులు కూడా చేసినట్టు సమాచారం. పేరుకు చంద్రబాబు కేబినెట్‌లో బీజేపీకి రెండు మంత్రి పదవులు ఉన్నప్పటికీ కామినేని టీడీపీ మంత్రులకంటే దారుణంగా చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. బీజేపీ మంత్రిగా ఉంటూ కామినేని చేస్తున్న పనుల వల్ల చివరకు బీజేపీకి చెడ్డపేరు వస్తోందని వాపోతున్నారు. ఇటీవల జరిగిన బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశంలోనూ అందరు నేతలు చంద్రబాబు తీరును విమర్శిస్తే మంత్రి కామినేని మాత్రం కేంద్రంలో టీడీపీకి మరిన్ని పదవులు ఇవ్వాలని డిమాండ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. మొత్తం బీజేపీ ముసుగులో పనిచేస్తున్న టీడీపీ మంత్రి కామినేనిపై అధినాయకత్వం చర్యలు తీసుకుంటుందో లేదో!. లేక ఏపీలో ప్రాసలనాయుడి సహకారంతో బాబుతో కలిసి కమలనాయకుడు నడుస్తారో!.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News