తెలంగాణ తిక్క రెడ్లు…

తుమ్మల నాగేశ్వరరావు. ఈయనది చంద్రబాబు సామాజికవర్గం. టీడీపీకి రాజ గురువులాంటి రామోజీకి చాలా దగ్గర మనిషి. మరో పత్రికా అధిపతికి అత్యంత ఆత్మీయుడు. అలాగే మాగంటి గోపినాథ్.  జూబ్లిహిల్స్ టీడీపీ  ఎమ్మెల్యేగా గెలిచారు. బాబు సామాజికవర్గమే. చంద్రబాబు ఆడిగితే తల నరికి చేతిలో పెట్టేంత అభిమాని. ఇలా చెబితే చంద్రబాబు కోసం ప్రాణాలిచ్చేందుకు సిద్ధపడే సొంత సామాజికవర్గం నేతలు తెలంగాణలో చాలా మంది ఉన్నారు. కానీ వారంతా ఇప్పుడు టీడీపీలో లేరు. టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. వీరంతా ఎందుకు […]

Advertisement
Update: 2016-03-30 01:55 GMT

తుమ్మల నాగేశ్వరరావు. ఈయనది చంద్రబాబు సామాజికవర్గం. టీడీపీకి రాజ గురువులాంటి రామోజీకి చాలా దగ్గర మనిషి. మరో పత్రికా అధిపతికి అత్యంత ఆత్మీయుడు. అలాగే మాగంటి గోపినాథ్. జూబ్లిహిల్స్ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. బాబు సామాజికవర్గమే. చంద్రబాబు ఆడిగితే తల నరికి చేతిలో పెట్టేంత అభిమాని. ఇలా చెబితే చంద్రబాబు కోసం ప్రాణాలిచ్చేందుకు సిద్ధపడే సొంత సామాజికవర్గం నేతలు తెలంగాణలో చాలా మంది ఉన్నారు. కానీ వారంతా ఇప్పుడు టీడీపీలో లేరు. టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. వీరంతా ఎందుకు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారంటే. కారణం తెలంగాణలో టీడీపీకి మనుగడ లేదనే. ఈ విషయం తెలిసి కూడా టీడీపీలో ఉండిపోతే వచ్చే ఎన్నికల నాటికి అవకాశాలు మరో సామాజివర్గం చేతిలోకి వెళ్లిపోతాయి. అప్పుడు తెలంగాణలో చంద్రబాబు సామాజికవర్గం ఆనవాళ్లు రాజకీయంగా పూర్తిగా మాయమైపోతాయి. అందుకే చంద్రబాబు కోసం ప్రాణాలిచ్చేందుకు సైతం సిద్ధపడే మాగంటిగోపినాథ్ లాంటి వారు కూడా టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోయారు. వారి భవిష్యత్తుకు, వారి సామాజిక వర్గం వారికి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. సొంతసామాజికవర్గం నేతలు టీఆర్ఎస్‌లో చేరిపోవడం చంద్రబాబుకు తెలిసే జరిగిందని కొందరు అంటూవుంటే, చంద్రబాబు, రామోజీల ఆలోచనల ప్రకారమే వాళ్లంతా టీఆర్ఎస్ లోకి వెళ్లారని మరికొందరు చెబుతుంటారు. అలా బాబు సొంతసామాజికవర్గం నేతలే పార్టీ వదిలేసి వెళ్లగా…

రెడ్డి సామాజికవర్గం నేతలు మాత్రం ఆ పార్టీకి కాపాలా కాస్తూ బతికేస్తున్నారు. ఇటీవల చంద్రబాబు తెలంగాణ తెలుగు తమ్ముళ్లతో మీటింగ్ పెడితే దానికి కమ్మ సామాజిక వర్గానికిచెందిన ఒక్కరు కూడా హాజరుకాలేదు. వచ్చిందంతా రెడ్లే. రేవంత్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, నర్సిరెడ్డి మొదలైనవారు. చంద్రబాబు నాయకత్వానికి విధేయులుగా వుంటామని ప్రకటించారు. అందులో రేవంత్‌ రెడ్డి ముఖ్యులు. చివరకు టీడీపీ హెడ్ ఆఫీస్‌ కూడా గుంటూరు తరలివెళ్తోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయినా సరే రేవంత్‌ మాత్రం టీడీపీ కోసం కంటిమీద కునుకు లేకుండా కాపుకాస్తున్నారు. తనకు తెలంగాణలో రెడ్డి సామాజికవర్గం అండ ఉందని తనకు తాను చెప్పుకుంటుంటారు రేవంత్. అయితే ఆయన అభిప్రాయంతో రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు ఏకీభవించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో రెడ్డి సామాజికవర్గం వారిపై కక్షసాధిస్తున్న చంద్రబాబు .. తెలంగాణలోకి వచ్చేసరికి తమపై ప్రేమ కురిపిస్తే నమ్మేంత పిచ్చివాళ్లమా అని ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు సామాజికవర్గం నేతలే పార్టీ వదిలేసి టీఆర్ఎస్‌లో చేరిపోయారు… అలాంటి పార్టీకి రెడ్డి సామాజికవర్గం మద్దతు పలకాలంటే తామేమైనా కాపల కుక్కలమా అని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి, ఇతర రెడ్డి సామాజికవర్గం నేతలు టీడీపీని పట్టుకుని వేలాడుతున్నారంటే అది వారి వ్యక్తిగతమని…ఆ విషయం చెప్పకుండా రెడ్లంతా తన వెంట ఉన్నారని రేవంత్ రెడ్డి చెప్పడం సొంత సామాజికవర్గాన్ని అవమానించడమే అంటున్నారు. రేవంత్ రెడ్డి, ఇతర టీటీడీపీ రెడ్డి నేతలు తెలివైన వారైతే… చంద్రబాబు సొంతసామాజికవర్గం నేతలు టీడీపీని వీడి వెళ్లడాన్ని చూసైనా కళ్లు తెరవాలని సూచిస్తున్నారు. రేవంత్‌ గట్టి వ్యక్తే అయినా …టీడీపీలో ఉంటే మునిగిపోవడం ఖాయమని కొందరు అభిప్రాయపడుతున్నారు.

అయితే మరికొందరు మాత్రం రేవంత్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. అతనికి ఏ విలువలు లేవని, సొంత సామాజిక వర్గమైన రెడ్లను తిట్టినందుకు కమ్మ సామాజిక వర్గ నాయకులు విసిరే ఎంగిలి పైసలకోసం ఎంతటి నీచానికైనా దిగజారుతాడని విమర్శిస్తున్నారు. ఇటీవల రేవంత్ తెలంగాణలో అన్ని పార్టీలలో వున్న రెడ్లను ఒక గొడుగు కిందకు తీసుకువచ్చి ఒక పార్టీ పెట్టాలని ప్రయత్నించాడని, అతని నీచత్వాన్ని గురించి తెలిసిన కాంగ్రెస్ పార్టీ రెడ్డినాయకులు అతనిని పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News