సర్పంచ్‌ నుంచి పీఏసీ వరకు…

తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఏకంగా పీఏసీ (ప్రజాపద్దుల కమిటి) చైర్మన్‌గా జగన్‌ నియమించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.  అప్పటి వరకు పీఏసీ రేసులో బుగ్గన పేరు కూడా వినిపించలేదు. కానీ ఆయన ప్రతిభే పదవి తెచ్చి పెట్టింది.  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుటుంబ, రాజకీయ నేపథ్యం పరిశీలిస్తే… ఈయన కుటుంబం నుంచి బుగ్గన శేషారెడ్డి డోన్ ఎమ్మెల్యేగా పనిచేశారు.  ఆయన వారసుడిగా రాజేంద్రనాథ్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత బేతంచెర్ల మేజర్ గ్రామపంచాయితీ సర్పంచ్‌గా […]

Advertisement
Update: 2016-03-21 22:38 GMT

తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఏకంగా పీఏసీ (ప్రజాపద్దుల కమిటి) చైర్మన్‌గా జగన్‌ నియమించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పటి వరకు పీఏసీ రేసులో బుగ్గన పేరు కూడా వినిపించలేదు. కానీ ఆయన ప్రతిభే పదవి తెచ్చి పెట్టింది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుటుంబ, రాజకీయ నేపథ్యం పరిశీలిస్తే… ఈయన కుటుంబం నుంచి బుగ్గన శేషారెడ్డి డోన్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన వారసుడిగా రాజేంద్రనాథ్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత బేతంచెర్ల మేజర్ గ్రామపంచాయితీ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఎన్నికల్లోనూ సర్పంచ్‌గా రెండోసారి గెలిచారు. 2008లో కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం వైసీపీలోకి చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున డోన్ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

బుగ్గన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో పదవ తరగతి పూర్తి చేశారు. మద్రాస్‌ క్రిస్టియన్ కాలేజ్‌లో ఇంటర్ చదివారు. బళ్లారి విజయ్‌నగర్ కాలేజ్లో ఇంజనీర్ కంప్యూటర్‌ సైన్స్ పూర్తి చేశారు. 1994లో తొలిసారి రాజకీయాల్లోకి బుగ్గన అడుగుపెట్టారు. మంచి మాటకారిగా ఈయనకు పేరుంది. ఆర్థిక, బడ్జెట్ తదితర అంశాలపై మంచి పట్టు ఉంది. బుగ్గన తండ్రి పేరు రామనాథ్‌ రెడ్డి.

అంశాలను లోతుగా అధ్యయనం చేయడం, దాన్ని అర్థమయ్యేవిధంగా వివరించడంలో బుగ్గనకు మంచి పేరుంది. వైసీపీ తరపున అసెంబ్లీలో బాగా మాట్లాడే వారిలోనూ బుగ్గన పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. బుగ్గనతో డోన్ నియోజకవర్గానికి పీఏసీ పదవి దక్కడం ఇది రెండో సారి. గతంలో టీడీపీ తరపున కేఈ కృష్ణమూర్తి కూడా పీఏసీ చైర్మన్‌గా పనిచేశారు. పీఏసీ వంటి కీలక మైన పదవికి బుగ్గన అన్ని విధాలుగా అర్హుడని భావించే ఆయనకు ఈ పదవి కట్టబెట్టినట్టు భావిస్తున్నారు. జగన్‌ పట్ల రాజేంధ్రనాథ్ రెడ్డి విధేయత కూడా కలిసొచ్చింది.

Click on Image to Read:

 

 

Tags:    
Advertisement

Similar News