కుక్కలకు ఎమ్మెల్యే అన్న విచక్షణజ్ఞానం లేదు... జిల్లాల వారిగా కుక్కల లెక్కలు చెప్పిన నారాయణ

రాష్ట్రంలోని కుక్కలపై అసెంబ్లీలో చర్చ జరిగింది. విశాఖలో కుక్కల అంశాన్ని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు లేవనెత్తారు. విశాఖలో కుక్కల బాధ అధికమైపోయిందన్నారు. ” అధ్యక్షా … విశాఖలో కుక్కల బెరద అధికమైపోయింది. 13 జిల్లాల్లో కన్నా విశాఖలో ఎక్కువ కుక్కలు ఉన్నాయి. లక్షకు పైగా ఉన్నాయి. నేను ఎమ్మెల్యే అన్న ఇంకిత జ్ఞానం కూడా కుక్కలకు లేకుండా పోయింది. నన్నే కరిచేందుకు వచ్చాయి. గతేడాది ఏకంగా 2000 మందిని కరిచాయి” అని విష్ణుకుమార్ రాజు చెప్పారు. విశాఖలో […]

Advertisement
Update: 2016-03-17 01:21 GMT

రాష్ట్రంలోని కుక్కలపై అసెంబ్లీలో చర్చ జరిగింది. విశాఖలో కుక్కల అంశాన్ని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు లేవనెత్తారు. విశాఖలో కుక్కల బాధ అధికమైపోయిందన్నారు. ” అధ్యక్షా … విశాఖలో కుక్కల బెరద అధికమైపోయింది. 13 జిల్లాల్లో కన్నా విశాఖలో ఎక్కువ కుక్కలు ఉన్నాయి. లక్షకు పైగా ఉన్నాయి. నేను ఎమ్మెల్యే అన్న ఇంకిత జ్ఞానం కూడా కుక్కలకు లేకుండా పోయింది. నన్నే కరిచేందుకు వచ్చాయి. గతేడాది ఏకంగా 2000 మందిని కరిచాయి” అని విష్ణుకుమార్ రాజు చెప్పారు.

విశాఖలో కుక్కల కన్నా దొంగల ప్రవర్తనే బాగుందన్నారు. విష్ణుకుమార్‌ రాజు అభ్యర్తనపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పందించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కుక్కలను చంపేందుకు వీల్లేదన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 3.47 లక్షల కుక్కలు ఉండగా ఒక్క విశాఖలోనే లక్షా 39 వేల కుక్కలున్నాయన్నారు. స్టెరిలైజేషన్‌ ద్వారా కుక్కల సంఖ్యను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని నారాయణ చెప్పారు. కుక్కలకు తాను ఎమ్మెల్యేనన్న విచక్షణ జ్ఞానం కూడా లేకుండా పోయిందని విష్ణుకుమార్ రాజు అనడంతో సభలో అందరూ నవ్వారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News