ఇలాగైతే ఏపీకి కష్టం అధ్యక్షా-బాబు, ఈ రీల్‌కు రెండేళ్లు అయింది అధ్యక్షా- జగన్‌

విభజనచట్టంలో ఇచ్చిన హామీలను వెంటనే నేరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. తీర్మానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో ప్రవేశపెట్టారు. ఏపీ పరిస్థితిని వివరించారు. దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీ వెనుకబడిపోయిందన్నారు. ఏపీలో నగర జనాభా తక్కువగా ఉండడం వల్ల ఆదాయం తక్కువగా ఉందన్నారు. వ్యవసాయ ఆధారితమైన చోట్ల ఆదాయం తక్కువగా ఉంటుందని… కాబట్టి ఏపీలో పట్టణీకరణ పెరగాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో జనాభా తక్కువ .. ఆదాయం ఎక్కువ ఉందన్నారు. […]

Advertisement
Update: 2016-03-16 03:20 GMT

విభజనచట్టంలో ఇచ్చిన హామీలను వెంటనే నేరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. తీర్మానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో ప్రవేశపెట్టారు. ఏపీ పరిస్థితిని వివరించారు. దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీ వెనుకబడిపోయిందన్నారు. ఏపీలో నగర జనాభా తక్కువగా ఉండడం వల్ల ఆదాయం తక్కువగా ఉందన్నారు. వ్యవసాయ ఆధారితమైన చోట్ల ఆదాయం తక్కువగా ఉంటుందని… కాబట్టి ఏపీలో పట్టణీకరణ పెరగాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో జనాభా తక్కువ .. ఆదాయం ఎక్కువ ఉందన్నారు. ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా ఉందన్నారు.

మెట్రో నగరాలు ఉన్న రాష్ట్రాలే అభివృద్ధిలో ముందుకెళ్లగలుగుతున్నాయన్నారు. పోలవరంపై 1950 కోట్లు ఖర్చు చేస్తే కేంద్రం నుంచి 345 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. విభజన వల్ల రాష్ట్రం నష్టపోతుందని తాము చెప్పినా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రాజధాని నిర్మాణానికి లక్షా 25 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా అన్నారు. కేంద్రం సాయం చేయకపోతే ఏపీకి ఇబ్బందులు తప్పవని సభలో చంద్రబాబు చెప్పారు.

తీర్మానంపై స్పందించిన జగన్ … చంద్రబాబు తీరును తప్పుపట్టారు. గడిచిన రెండేళ్లుగా చంద్రబాబు ఇదే రీల్‌ను తిప్పుతున్నారని ఎద్దేవా చేశారు. అదిగో చేస్తారు ఇదిగో చేస్తారు అంటూ రెండేళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నామన్నారు. ఇక్కడ బీద ఏడుపులు ఏడవడం.. ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను పొగడడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. మరో నెలలో కేంద్రం విభజన హామీలను నెరవేర్చలేని పక్షంలో కేంద్రం నుంచి టీడీపీ మంత్రులను ఉపసంహరించుకుంటామని అల్టిమేటం ఇచ్చే ఉద్దేశం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి పెట్టకుండా ఇలా ఎన్ని తీర్మానాలుచేసినా లాభం ఉండదన్నారు జగన్. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలంటూ తీర్మానంలో ఉందని… సీమ, ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం జిల్లాను కూడా ఆ జాబితాలో చేర్చాలని జగన్ విజ్ఞప్తి చేశారు.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News